Bones Health Foods: మీ ఎముకలు బలంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. మీ శరీరానికి ఖనిజాలు పుష్కలంగా ఉండాలి.  క్యాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి ఈ ఆహారాలు ఎముకలు దృఢంగా మార్చడంతో పాటు సాంధ్రతను పెంచుతాయి. కాల్షియం, మినరల్స్ ఉండే ఆహారాలు మన ఎముకలకు మంచివి విటమిన్ డి పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల క్యాల్షియం త్వరగా ఎముకలకు ఆ గ్రహిస్తుంది ఎముకలు పెరుగుదలకు ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాలి. ముందుగా ఇది ఆస్టియోపోరోసిస్ వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతుంది. కొన్ని రకాల పండ్ల రసాలు, పాలు, ఆహారాలు తీసుకుంటే ఎముకలు దృఢంగా మారుతాయి అవేంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాలు..
పాలలో క్యాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం విటమిన్ ఏ, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా సోయాబీన్స్ తయారుచేసిన పాలు, ఆవు పాలు, బాదంపాలు, కొబ్బరి పాలు తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి అని యూఎస్‌డీఏ నివేదిక తెలిపింది.


గ్రీన్స్ స్మూథి..
సాదరణంగా గ్రీన్ స్మూతీలను ఆకుకూరలతో తయారుచేస్తారు పాలకూర కాలే తయారు చేస్తారు. ఇందులో ఎక్కువ శాతం క్యాల్షియం యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి, విటమిన్ కే పుష్పలంగా ఉంటాయి. మూడు రకాల నీటిని తీసుకోవటం వల్ల ఇమ్యూనిటీ వ్యవస్థ బలపడుతుంది ఎముకలు బలంగా ఉంటాయి.


బ్రోకలీ జ్యూస్..
బ్రోకోలీలో క్యాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ సి, పొటాషియం, ఫోలేట్ ,విటమిన్ కే పుష్కలంగా ఉంటాయి. బ్రోకలీ జ్యూస్ మన డైట్ లో చేర్చుకోవడం వల్ల డయాబెటిస్ కి వ్యతిరేకంగా పోరాడుతాయి. క్యాన్సర్ హై బ్లడ్ ప్రెషర్ రాకుండా నివారిస్తుంది. బరువు తగ్గకుండా కూడా ప్రేరేపిస్తుందని ఎన్ఐహెచ్ తెలిపింది.


ఆరెంజ్ జ్యూస్..
ఆరేంజ్ లో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఆరెంజ్ జ్యూస్ తీసుకోవడం వల్ల కూడా ఎముకలు దృఢంగా మారుతాయి. ఆ రోజుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్స్ మన ఎముకల నిర్వహణకు సహాయపడతాయి.


గ్రీన్ టీ..
చాలామందికి గ్రీన్ టీ తో కూడా ఎముకలు దూడంగా ఉంటాయని తెలీదు. కానీ గ్రీన్ టీ ఎముకలను ఆరోగ్యంగా దృఢంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే కేటాచిన్స్ ఎముకలకు మంచివి. అంతేకాదు గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి మన ఎముకలను ఒక షీల్డ్ లా కాపాడతాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి