Healthy Foods For Brain Memory: మన మెదడు శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం. దీని ఆరోగ్యం మన మొత్తం శారీరక, మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. మెదడును ఆరోగ్యంగా ఉంచడానికి సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ రోజుల్లో చాలా మంది మతిమరుపుతో బాధపడుతున్నారు. దీని కారణం పోషకరమైన ఆహారం తీసుకుకపోవడం. మెదడుకు కావాల్సిన విటమిన్‌లు, మినరల్స్‌ను తీసుకోకపోవడం. అయితే ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల మెదడు చురుకుగా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మెదడుకు మంచి ఆహారాలు:


ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు: 


ఇవి మెదడు కణాలను రక్షిస్తాయి,  జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. చేపలు (సాల్మన్, ట్యూనా), అవిసె గింజలు, చియా గింజలు, వాల్‌నట్స్ వంటి ఆహారాల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా లభిస్తాయి.



యాంటీ ఆక్సిడెంట్లు: 


ఇవి మెదడును ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయి. బెర్రీలు (బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్), ముదురు ఆకు కూరలు (పాలకూర, బ్రోకలీ), క్యారెట్, టమోటా వంటి ఆహారాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.



హోల్ గ్రెయిన్స్:


 బ్రౌన్ రైస్, క్వినోవా, ఓట్స్ వంటి హోల్ గ్రెయిన్స్ మెదడుకు స్థిరమైన శక్తిని అందిస్తాయి.



లీన్ ప్రోటీన్లు: 


చికెన్, మటన్, గుడ్లు, బీన్స్ వంటి లీన్ ప్రోటీన్లు మెదడు పనితీరుకు అవసరమైన అమైనో ఆమ్లాలను అందిస్తాయి.


విటమిన్లు- మినరల్స్: 


విటమిన్ B12, విటమిన్ ఇ, జింక్ వంటివి మెదడు ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. ఇవి చేపలు, నట్స్‌ వంటి వాటిలో పుష్కలంగా లభిస్తాయి. 



బ్రెయిన్ యోగా: 


బ్రెయిన్ ఎక్సర్‌సైజ్ అంటే మన మెదడుకు చేసే వ్యాయామం. ఇది మన మెదడును చురుకుగా ఉంచి, దానిని బలపరుస్తుంది. మనం చిన్నప్పుడు ఆటలు ఆడుకోవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం ఇవన్నీ బ్రెయిన్ ఎక్సర్‌సైజ్‌లే.


బ్రెయిన్ ఎక్సర్‌సైజ్ ఎందుకు ముఖ్యం?


మెదడును చురుకుగా ఉంచుతుంది: జిమ్‌కు వెళ్లి శరీరాన్ని బలపరుస్తున్నట్లే, బ్రెయిన్ ఎక్సర్‌సైజ్ మన మెదడును చురుకుగా ఉంచుతుంది.


కొత్త విషయాలు నేర్చుకోవడం సులభం చేస్తుంది: కొత్త భాషలు నేర్చుకోవడం, కొత్త నైపుణ్యాలు అభివృద్ది చేసుకోవడం బ్రెయిన్ ఎక్సర్‌సైజ్‌ల ద్వారా సులభమవుతుంది.


మెమరీని బలపరుస్తుంది: వయసుతో మెమరీ తగ్గిపోతుంది. కానీ, బ్రెయిన్ ఎక్సర్‌సైజ్‌లు మెమరీని మెరుగుపరుస్తాయి.


స్ట్రెస్‌ను తగ్గిస్తుంది: మనం కొత్త విషయాలలో పాల్గొన్నప్పుడు మనసు స్ట్రెస్‌ నుంచి విముక్తి పొందుతుంది.


ఈ విధంగా మెదడును చురుకుగా తయారు చేసుకోవచ్చు. పిల్లల బ్రెయిన్‌ షార్ప్‌గా ఉండాలంటే ఆహారంతో పాటు కొన్ని ఎక్సర్‌సైజ్‌లు చేయాల్సి ఉంటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.


Also read: Healthy Drink: డయాబెటిస్‌ నుంచి కిడ్నీ స్టోన్స్‌ వరకు ఈ టీ ఒక దివ్వ ఔషధం!!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter