Broccoli Health Benefits: బ్రోకోలీ మాములు క్యాలీఫ్లవర్‌ మాదిరి ఉండి, గ్రీన్‌ కలర్‌ లో ఉంటుంది. ఇది మన శరీరానికి రోజంతటికీ కావాల్సిన హైడ్రేషన్‌ అందిస్తుంది. ఇది కడుపు సంబంధిత సమస్యలకు చెక్‌ పెడుతుంది. ఈ మండే ఎండలకు బ్రోకోలీ డైట్లో చేర్చుకుంటే అనేక ఆరోగ్య ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇది సమ్మర్‌ పెర్ఫెక్ట్‌ వెజిటేబుల్‌. దీంతో కలిగే 7 ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చల్లదనం..
బ్రోకోలీ డైట్లో చేర్చుకుంటే ఇందులోని నీటి శాతం వల్ల మన శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. బ్రోకోలీలో దాదాపు 92 శాతం నీరు ఉంటుంది. ఇది మన శక్తిని పెంచుతాయి. రోజంతా యాక్టీవ్‌గా ఉండేలా చేస్తుంది.


యాంటీ ఆక్సిడెంట్‌..
బ్రోకోలీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్‌ సీ, బీటా కెరోటీన్‌ హానికర యూవీ కిరణాల రేడియేషన్‌ నుంచి శరీరాన్ని కాపాడుతుంది. ఇది మంట సమస్యను తగ్గిస్తుంది. ఇది ప్రాణాంతక వ్యాధులను నివారిస్తుంది.


చర్మ ఆరోగ్యం..
ఈ గ్రీన్‌ బ్రోకోలీ స్కిన్‌ సన్‌ డ్యామేజ్‌ అవ్వకుండా కాపాడుతుంది. స్కిన్ ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. బ్రోకోలీ మీ డైట్లో చేర్చుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా మెరుస్తు ఉంటుంది.  ఇది కొల్లాజెన్‌ ఉత్పత్తికి కూడా తోడ్పడుతుంది. బ్రోకోలీతో చర్మం కాంతివంతంగా మారుతుంది.


ఇదీ చదవండి: యూరిక్ యాసిడ్ ను 3 విధాలుగా సహజంగా తగ్గించుకోవచ్చు తెలుసా?


సులభంగా జీర్ణం..
బ్రోకోలీలో సాధారణంగా ఫైబర్‌, నీటి శాతం అధికంగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థకు మంచిది. ఇది సులభంగా జీర్ణం అవుతుంది. బ్రోకోలీలో ఉండే కొన్ని రకాల ఎంజైమ్‌లు జీర్ణక్రియకు సహాయపడతాయి.


ఇమ్యూనిటీ బూస్ట్‌..
బ్రోకోలీలో ఉండే విటమిన్స్‌, మినరల్స్‌ ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తాయి. ఇది శరీర మంటను కూడా తగ్గిస్తుంది. బ్రోకోలీ మీ సమ్మర్‌ డైట్లో చేర్చుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. 


హైడ్రేషన్‌..
బ్రోకోలీ మీ డైట్లో చేర్చుకుంటే రోజంతటికీ కావాల్సిన హైడ్రేషన్‌ అందుతుంది. ఎండకాలం మీ శరీరానికి కావాల్సిన హైడ్రేషన్ అందుతుంది. ఎందుకంటే ఎండకాలం ఎక్కువ శాతం డీహైడ్రేట్‌ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ సమయంలో మీరు బ్రోకోలీ డైట్లో చేర్చుకోవడం ఆరోగ్యకరం.


ఇదీ చదవండి:  కడుపులో గ్యాస్, అజీర్తికి చెక్ పెట్టే 5 సూపర్ ఫుడ్స్ ఇవే..


ఆరోగ్యకరమైన గట్‌..
బ్రోకోలీ తీసుకోవడం వల్ల కడుపు ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులోని ఫైబర్‌ కడుపులో మంచి బ్యాక్టిరియా పెరగడానికి సహకరిస్తుంది. దీంతో కడుపు సంబంధిత సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ఇలా బ్రోకోలీ డైట్లో చేర్చుకోవడం వల్ల ఇందులోని ఫైబర్‌తో జీర్ణక్రియ మెరుగవుతుంది. కడుపు సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు. అంతేకాదు మీకు గ్లోయింగ్‌ స్కిన్‌ కూడా లభిస్తుంది. ఇందులో హైడ్రేటింగ్‌ గుణాలు ఉంటాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి