Health Benefits Of Drinking Broccoli Juice: బ్రోకలీ.. క్యాబేజీ కుటుంబానికి చెందిన ఓ మొక్క. బ్రోకలీ ఆకుపచ్చ రంగులో చూడ్డానికి గోబీ పువ్వు లానే ఉంటుంది. ఇది తినడానికి రుచికరమైనదే కాదు.. ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. బ్రోకలీలో ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం, ఐరన్, విటమిన్-ఎ పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఫైబర్, విటమిన్-సి కూడా సమృద్ధిగా లభిస్తాయి. దీన్ని తీసుకోవడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా మెదడు చురుగ్గా పనిచేయడంలో బ్రోకలీ జ్యూస్ సాయపడుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మెదడు చురుగ్గా:
బ్రోకలీలో ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు, కాల్షియం, ఐరన్ మరియు విటమిన్-ఎ, ఫైబర్ మరియు విటమిన్-సి పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి చాలా ముఖ్యం. బ్రోకలీ జ్యూస్ తాగడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా మెదడు చురుగ్గా పని చేయాలంటే తప్పనిసరిగా బ్రోకలీ జ్యూస్ తాగాలి. ఆలస్యం ఎందుకు ఇప్పుడే ఈ జ్యూస్ తాగడం అలవాటు చేసుకోండి.


గుండెపోటు చెక్:
బ్రోకలీ జ్యూస్‌లో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే గుండెపోటు వచ్చే  ప్రమాదం ఉంటుంది. బ్రోకలీ జ్యూస్ తాగితే గుండెపోటు సమస్యలకు చెక్ పెట్టొచ్చు. 


హై బీపీ అదుపులో:
బ్రోకలీ జ్యూస్ హై బీపీ మరియు హృద్రోగులకు కూడా చాలా మేలు చేస్తుంది. ఈ జ్యూస్ వల్ల బీపీ అదుపులో ఉండడంతో పాటు గుండె జబ్బులు కూడా తగ్గుతాయి. శరీరంలో ఎర్ర కణాలను పెంచడంలో కూడా సాయపడుతుంది. 


రక్తంలో చక్కెర నియంత్రణ:
బ్రోకలీ జ్యూస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు మరియు పీచు పదార్థాలు ఉంటాయి. ఇవి మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుతాయి. బ్రోకలీ జ్యూస్‌ తాగడం వలన రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. ఇది ఇన్సులిన్ స్థాయిని సమతుల్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. టైప్ 2 డయాబెటిస్‌ను కూడా తగ్గింస్తుంది. 


బలంగా ఎముకలు: 
బ్రోకలీ జ్యూస్ ఎముకలకు కూడా చాలా మేలు చేస్తుంది. ఇందులో కాల్షియం మరియు విటమిన్-కె పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. 


Also Read: India Vs Ireland: వికెట్‌ కీపర్‌గా సంజూ, ఇషాన్‌ వద్దు.. అతడే సరైనోడు: గవాస్కర్


Also Read: Vastu tips: ఈ 7 పరిహారాలతో ఇంటి వాస్తు దోషాలు తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది!



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.