Blue Tea: మధుమేహాన్ని శాశ్వతంగా తగ్గించే బ్లూ టీని ఎప్పుడైనా తాగారా?, ఈ టీతో కొలెస్ట్రాల్ సైతం కరగాల్సిందే!
Reduce Diabetes And Cholesterol With Blue Tea: అపరిజాత పుష్పాలతో తయారుచేసిన టీ ని ప్రతిరోజు తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి ముఖ్యంగా శరీర బరువును తగ్గించి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ టీవీ తాగాల్సి ఉంటుంది.
Reduce Diabetes And Cholesterol With Butterfly Pea Tea: ఆధునిక జీవన శైలి అనేది పెద్ద ప్రమాదంగా మారింది. చాలామంది చిన్న వయసులోనే తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు 35 సంవత్సరాలు రాగానే మధుమేహం, ఊబకాయం అధిక రక్తపోటు సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి తప్పకుండా ఎంతో కొంత అయినా సమయాన్ని శరీరానికి కేటాయించాల్సి ఉంటుంది. దీంతోపాటు ప్రతిరోజు ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. అయితే చాలామంది ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఉదయాన్నే గ్రీన్ టీ లని తాగుతున్నారు. ఇలా చేయడం వల్ల కూడా ఎన్నో రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
దీర్ఘకాలిక వ్యాధులతో కూడా ఈ గ్రీన్ టీ లను తాగచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చాలామంది తెలిసినవారు గ్రీన్ టీ తో బదులు ఆయుర్వేద మూలికలను కూడా మిక్స్ చేసుకొని తీసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు శరీరానికి కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వారు సూచించిన బ్లూ టీని ప్రతిరోజు తాగితే శరీరానికి రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయట. అయితే ఈ బ్లూ టీ ని ఎలా తయారు చేసుకోవాలో.. అసలు దీనిని ఏ మూలికతో తయారు చేసుకుంటారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read: Minister KTR: వారికి సెలవులు రద్దు.. అధికారులకు కేటీఆర్ కీలక ఆదేశాలు
బ్లూ టీ ని కొందరు బటర్‌ఫ్లై పీ ఫ్లవర్ టీ అని కూడా అంటారు. దీనిని అడవుల్లో లభించే అపరిజాత పుష్పాలతో తయారుచేస్తారు. ఇందులో చాలా రకాల ఔషధ గుణాలతో పాటు పోషక విలువలు లభిస్తాయి కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు శరీరంలోని కొలెస్ట్రాలను తగ్గించుకోవాలనుకునేవారు ప్రతిరోజు ఈ అపరిజాత పుష్పాలతో తయారు చేసిన టీని తాగాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు జీర్ణక్రియ వ్యవస్థను కూడా మెరుగుపరిచేందుకు సహాయపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తరచుగా జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారు ఈ టీవీ ప్రతిరోజు రెండు కప్పుల చొప్పున తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
చిన్న వయసులోనే మధుమేహం సమస్యలతో బాధపడేవారు తప్పకుండా అపరిజాత పుష్పాలతో తయారుచేసిన టీని తాగాల్సి ఉంటుంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు సులభంగా రక్తంలోని చక్కర పరిమాణాలను నియంత్రిస్తాయి. అంతేకాకుండా మధుమేహాన్ని శాశ్వతంగా తగ్గించేందుకు కూడా సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తరచుగా రక్తంలోని చక్కర పరిమాణాలు పెరగడం తగ్గడం వంటి సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ టీ ని తాగాల్సి ఉంటుంది.
Also Read: Minister KTR: వారికి సెలవులు రద్దు.. అధికారులకు కేటీఆర్ కీలక ఆదేశాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి