Weight Loss Diet: క్యాబేజీ రసంతో ఇన్ని ప్రయోజనాలా?, వేగంగా బరువు తగ్గించే అద్భుత చిట్కా ఇదే!
Cabbage juice For Weight Loss: ప్రతిరోజు క్యాబేజీ రసం తాగడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గడమే కాకుండా సులభంగా కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి.
Cabbage juice For Weight Loss: భారతీయులు సలాడ్స్ లో అధికంగా వినియోగించే కూరగాయల్లో క్యాబేజీ కూడా ఒకటి. అంతేకాకుండా ఇందులో ఉండే మూలకాలు నోటికి రుచిని అందించడమే కాకుండా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. క్యాబేజీని జ్యూస్ లా చేసుకొని ప్రతిరోజు తాగడం వల్ల శరీరానికి చాలా రకాల పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పరిమాణాలు అధికంగా ఉండడం వల్ల కొలెస్ట్రాల్ని కూడా నియంత్రిస్తాయి. క్యాబేజీ లో విటమిన్ కే, విటమిన్ సి, విటమిన్ ఈ వంటి చాలా రకాల విటమిన్లు లభిస్తాయి. కాబట్టి దీనిని జ్యూస్ లా తయారు చేసుకునే తాగడం వల్ల శరీరానికి కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాబేజీ రసం తాగడం వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు ఇవే:
రక్తపోటును నియంత్రిస్తుంది:
క్యాబేజీ రసంలో ఉండే పోషకాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా రక్తపోటు సమస్యలతో బాధపడుతున్న వారి కూడా ప్రభావవంతంగా సహాయపడతాయి. తీవ్ర రక్తపోటు సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతిరోజు క్యాబేజీ రసాన్ని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.
శరీర బరువును తగ్గిస్తుంది:
బరువు పెరగడం ప్రస్తుతం సర్వసాధారణమైన. అధికంగా ఆయిల్ ఫుడ్స్ తినడం వల్ల సులభంగా బరువు పెరుగుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా క్యాబేజీ రసాన్ని క్రమం తప్పకుండా తాగాల్సి ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ శరీర బరువును తగ్గించడమే కాకుండా అనారోగ్య సమస్యల బారిన పడకుండా బాడీని రక్షిస్తుంది.
రోగ నిరోధక శక్తిని పెంచుతుంది:
కోవిడ్ తర్వాత చాలామంది రోగ నిరోధక శక్తి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు క్యాబేజీ రసాన్ని ఖాళీ కడుపుతో తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు రోగ నిరోధక శక్తిని పెంచి సీజనల్ వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తుంది.
క్యాబేజీ రసం తయారీ పద్ధతి:
ఒక క్యాబేజీని తీసుకొని దానిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని తీసుకుని వడకట్టుకోవాలి. అందులోని రుచికి సరిపడా తేనెను వేసి ప్రతిరోజు తాగితే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి