Calcium Deficiency: కాల్షియం లోపముంటే రికెట్స్, ఆస్టియోపోరోసిస్ తప్పదా, ఎలాంటి పదార్ధాలు తీసుకోవాలి
Calcium Deficiency: ఎముకల బలోపేతానికి కాల్షియం చాలా అవసరం. కాల్షియం లోపముంటే బోన్స్ బలహీనమైపోతాయి. కాల్షియం లోపం కారణంగా..రికెట్స్, ఆస్టియోపోరోసిస్ వంటి తీవ్రమైన వ్యాధులు తలెత్తుతాయి.
శరీరంలో ఎముకలు బలహీనంగా ఉంటే ఏ పనీ చేయలేం. శరీరంలో పోషకాల లోపం కారణంగా తక్కువ వయస్సుకే ఎముకలు బలహీనమౌతాయి. బహుశా అందుకే ప్రతి ఒక్కరికీ నడుం నొప్పి, కీళ్ల నొప్పుల సమస్యలు బాధిస్తుంటాయి. బోన్స్ పటిష్టంగా ఉండాలంటే కాల్షియం ఎక్కువగా ఉండే పదార్ధాలు తీసుకోవాలి.
కాల్షియం ఎందులో ఉంటుంది
పాలలో కాల్షియం అధికంగా ఉంటుంది. కేవలం పాలు, పెరుగులోనే కాకుండా ఇంకా చాలా పదార్ధాల్లో కాల్షియం ఉంటుంది. నువ్వుల్లో చాలా పోషకాలుంటాయి. ఇందులో కాల్షియం చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. తెల్ల, నల్ల నువ్వులు రెండింట్లోనూ కాల్షియం, విటమిన్లతో నిండి ఉంటుంది. ఎముకల్ని పటిష్టం చేస్తాయి. నువ్వుల్ని లడ్డు లేదా చట్ని రూపంలో తీసుకోవచ్చు.
గ్రీన్ వెజిటెబుల్స్
ఆకుపచ్చ కూరగాయల్లో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. పాలకూరలో కాల్షియం పెద్దమొత్తంలో ఉంటుంది. పాలకూరతో పాటు బచ్చలి. ఆవాల్లో కూడా కాల్షియం ఎక్కువగానే ఉంటుంది. కూరగాయల్ని తినడం వల్ల ఎముకలు పటిష్టంగా మారతాయి.
సోయాబీన్స్
సోయాబీన్స్ కాల్షియంతో నిండి ఉంటాయి. సోయాబీన్‌తో తయారయ్యే పదార్ధాలు తినడం వల్ల కాల్షియం లోపం పోతుంది. దీనికోసం రోజూ డైట్‌లో సోయాబీన్స్ భాగంగా చేసుకోవాలి.
పప్పు
పప్పులో కాల్షియం అధిక మోతాదులో ఉంటుంది. శెనగపప్పు, రాజ్మా, మినపపప్పుల్లో కూడా కాల్షియం భారీగా ఉంటుంది. రోజూ డైట్‌లో భాగంగా చేసుకుంటే కాల్షియం లోపం తొలగిపోతుంది.
చేపలు
చేపల్లో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. పోషక పదార్ధాలు సమృద్ధిగా ఉండే చేపలు తినడం వల్ల ఎముకలు పటిష్టంగా మారుతాయి.
Also read: Covid19 Nasal Vaccine: కోవిడ్ బూస్టర్ డోసుగా నాసల్ వ్యాక్సిన్, ధర ఎంతో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook