Custard Apple: డయాబెటిస్ రోగులు సీతాఫలాలు తినొచ్చా, తింటే ఏమౌతుంది
Custard Apple: ప్రతి ఏటా వర్షాకాలం చివర్లో..శీతాకాలం ప్రారంభంలో లభించే అద్భుతమైన ఫ్రూట్ ఇది. బహుశా అందుకే సీతాఫలం అంటారేమో. ఆరోగ్యపరంగా అద్భుతమైన పోషకాలు కలిగిన సీతాఫలం అందరూ తినవచ్చా లేదా..ముఖ్యంగా డయాబెటిస్ రోగులకు ఏ మేరకు ఉపయోగకరం అనేది తెలుసుకుందాం..
Custard Apple: ప్రకృతిలో లభించే వివిధ రకాల పండ్లలో ఆరోగ్యానికి కావల్సిన అన్ని రకాల పోషకాలు సమృద్ధిగా లభిస్తుంటాయి. ఇందులో కొన్ని ఏడాదంతా లభిస్తే మరి కొన్ని కేవలం సీజనల్ ఫ్రూట్స్‌గా ఉంటాయి. మామిడి కేవలం వేసవిలో లభిస్తే సీతాఫలాలు కేవలం చలికాలం ప్రారంభంలో దొరుకుతాయి. సీతాఫలాల్లో ఆరోగ్యానికి కావల్సిన దాదాపు అన్ని పోషకాలు ఉంటాయి.
సీతాఫలం ఏడాదిలో ఒక్కసారే లభిస్తుంది. అద్భుతమైన రుచి దీని సొంతం. ఇందులో విటమిన్ సి, విటమిన్ బి6, ఫైబర్‌తో పాటు మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ వంటి పోషకాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. అందుకే సీతాఫలాలు తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. మలబద్ధకం వంటి సమస్యలు దూరమౌతాయి. ఆరోగ్యపరంగా ఇన్ని ప్రయోజనాలు కలిగిన సీతాఫలంలో కేలరీలు, నేచురల్ షుగర్ కంటెంట్ ఎక్కువ. అందుకే మధుమేహం వ్యాధిగ్రస్థులు సీతాఫలం తినవచ్చా లేదా అనే విషయంలో చాలా సందేహాలు ఉంటాయి అందరికీ. ఎందుకంటే ఇందులో కేలరీలు, షుగర్ కంటెంట్ ఎక్కువ. ఎక్కువమందైతే డయాబెటిస్ రోగులు సితాఫలాలు తినకూడదనే అంటారు.
సీతాఫలాల గ్లైసెమిక్ ఇండెక్స్ 54-55 మధ్యలో ఉంటుంది. అంటే రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్‌పై మాదిరి ప్రభావం చూపిస్తుంది. సీతాఫలాలు తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశముంది. కానీ అంతవేగంగా పెరగకపోవచ్చు. అందుకే సీతాఫలాలను డయాబెటిస్ రోగులు మితంగానే తీసుకోవాలి. పరిమితి మించి తీసుకోకూడదు. అంటే ఒకేసారి 2 పండ్లు తినకూడదు. కొద్ది కొద్గిగా తినవచ్చు. సీతాఫలాలు ఎక్కువగా తింటే ఇందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండటం వల్ల బరువు పెరిగే అవకాశముంది. అందుకే మితంగానే తినాలి.
ఇక ఇందులో ఉండే ఫైబర్ కారణంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం సమస్య దూరమౌతుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మనిషిని ఆరోగ్యంగా ఉంచుతాయి.
Also read: ED Raids in Ap: వైసీపీ మాజీ ఎంపీ , సినీ నిర్మాత ఆస్థులపై ఈడీ దాడులు, వేట మొదలైందా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.