Cancer Detection: సాధారణంగా కేన్సర్ మహమ్మారిని గుర్తించడంలో ఆలస్యం జరుగుతుంటుంది. సాధారణ లక్షణాలు పెద్దగా కన్పించవు. ఒకేసారి గంభీరమైన లక్షణాలతో బయటపడుతుంటుంది. అందుకే చికిత్స కష్టమౌతుంది. ప్రాణాంతకంగా మారుతుంటుంది. ఈ పరిస్థితి నివారించవచ్చంటున్నారు పరిశోధకులు. బవిష్యత్తులో కేవలం రక్త పరీక్ష ద్వారా కేన్సర్ నిర్ధారణ చేయవచ్చంటున్నారు. అదెలాగో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేన్సర్ విషయంలో ఇప్పటికీ ప్రపంచం నలుమూలలా ఏదో ఓ విధంగా రీసెర్చ్ జరుగుతూనే ఉంటోంది. కొన్ని రకాల కేన్సర్ వ్యాధుల్ని తగ్గించడం లేదా నియంత్రించే మందులు కనుగొంటున్నారు. పూర్తి స్థాయిలో చికిత్స మాత్రం ఉండటం లేదు. ఈ క్రమంలో వైద్య పరిశోధకులు చెబుతున్న అంశాలు ఊరటనిస్తున్నాయి. భవిష్యత్తులో కేవలం రక్త పరీక్ష ద్వారా కేన్సర్ లక్షణాలు బయటపడటానికి కనీసం ఏడేళ్ల ముందే కేన్సర్ నిర్ధారణ చేయవచ్చంటున్నారు. మొత్తం 19 రకాల కేన్సర్‌లను ఇలా గుర్తించవచ్చంటున్నారు. బ్రిటన్‌కు చెందిన నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో ఈ అంశాలు ప్రచురితమయ్యాయి. యూకే బయోబ్యాంక్ చేసిన అధ్యయనం ఇది. మొత్తం 44 వేలమంది బ్లడ్ శాంపుల్స్ సేకరించి పరిశీలించారు. అందులో 4900 మందికి తరువాత కేన్సర్ సోకినట్టు తేలింది. ఏ ప్రోటీన్‌తో కేన్సర్ ముప్పు ఉందనేది తెలుసుకునేందుకు రక్తంలో ఉండే 1463 ప్రోటీన్లను పరీక్షించారు. మొత్తం 44 వేలమందిలో తరువాత కేన్సర్ సోకినవారికి, సోకనివారికి పరీక్షలు చేసి పరిశీలించి ఇరువురి ప్రోటీన్లలో తేడా ఉందేమోనని చూశారు.


ఇందులో 618 ప్రోటీన్లు 19 రకాల కేన్సర్‌లతో ముడిపడి ఉన్నట్టుగా ఈ అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా ప్రేవులు, ఊపిరితిత్తులు, నాన్ హాంజకిన్ లింఫోమా, లివర్ కేన్సర్ వంటి రకాలున్నాయి. అయితే దీనిపై ఇంకా అధ్యయనం కొనసాగుతోంది. కేన్సర్‌ను ముందస్తుగా గుర్తించే క్రమంలో ఇది కీలకమైన పరిణామంగా పరిశోధకులు భావిస్తున్నారు. ఈ తరహా రక్త పరీక్షల్ని మరింతగా అభివృద్ధి చేస్తే కచ్చితంగా కేన్సర్‌ను ముందుగానే గుర్తించవచ్చంటున్నారు. తద్వారా ప్రపంచవ్యాప్తంగా కేన్సర్ మరణాల్ని తగ్గించవచ్చు. 


అయితే కేన్సర్‌ను మరీ ఏడేళ్ల ముందే గుర్తించగలిగితే అది చికిత్సకు ఎంతవరకూ ఉపయోగపడుతుందనే అంశాన్ని కూడా పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు. కేన్సర్ రోగిని మానసికంగా బలంగా మార్చేందుకు ఈ పరీక్షలు ఉపయోగకరం కావచ్చు. 


Also read: Dates Benefits: పీరియడ్స్ సమస్యలకు చెక్, రోజుకు 3-4 తింటే చాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook