COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Chia Seeds And Coffee For Weight Loss: ఆధునిక జీవనశైలిని అనుసరించే చాలా మందిలో అధిక బరువు సమస్యలు వస్తున్నాయి. అంతేకాకుండా శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలు విపరీతంగా పెరిగి దీర్ఘకాలిక వ్యాధులు బారిన కూడా పడుతున్నారు. అయితే ప్రాణాంక దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉండడానికి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా బరువును అదుపులో ఉంచుకోవడానికి పలు రకాల చిట్కాలు కూడా పాటించాల్సి ఉంటుంది. 


బరువు తగ్గడానికి చాలా మంది ఖాళీ కడుపుతో నిమ్మ రసం తాగుతున్నారు. అయితే ఈ రసం కూడా శరీరానికి ప్రభావంతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీర బరువును సులభంగా నియంత్రిస్తాయి. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగించడానికి కూడా దోహదపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే శరీర బరువును సులభంగా, వేగంగా నియంత్రించుకోవడానికి మేము ఈ రోజు ఓ రెసిపీని తెలపబోతున్నాం. దీనిని వినియోగించడం వల్ల సులభంగా శరీర బరువును నియంత్రించుకోవచ్చు. 


Also Read: Delhi Crime: ఢిల్లీలో కలకలం.. ఒకే రోజు ముగ్గురు హత్య  


చియా విత్తనాలు:
చియా గింజల్లో శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు లభిస్తాయి. ఇందులో  ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, డైటరీ ఫైబర్, ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్లతో పాటు కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. వీటిని ప్రతి రోజు ఆహారంలో తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు కాఫీలో చియా విత్తనాలను వేసుకుని తాగడం వల్ల మెరుపు వేగంతో శరీర బరువును పొందవచ్చు. 


జీర్ణక్రియ సమస్యలకు చెక్‌:
చియా విత్తనాలు కాఫీలో కలుపుకుని తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు జీర్ణక్రియ సమస్యలను దూరం చేసేందుకు ప్రభావంతంగా సహాయపడతాయి. అంతేకాకుండా ఇందులో ఫైబర్‌ కూడా అధిక పరిమాణంలో లభిస్తుంది. డైట్‌లో వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్‌ను కూడా సులభంగా నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు.


Also Read: Delhi Crime: ఢిల్లీలో కలకలం.. ఒకే రోజు ముగ్గురు హత్య  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook