Hmpv Virus Precautions: చైనాలో వేగంగా వ్యాపిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ భయం అందర్నీ వెంటాడుతోంది. ఇండియాలో కూడా ఈ వైరస్ సంక్రమించే ప్రమాదం లేకపోలేదని తెలుస్తోంది. ఈ నేపధ్యంలో చిన్నారులు, వృద్ధుల్ని ఈ వ్యాధి నుంచి సంరక్షించుకోవాలి. అసలు ఈ వ్యాధిల లక్షణాలు ఎలా ఉంటాయి , ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది పరిశీలిద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హెచ్ఎంపీవీ వ్యాధి సోకితే చిన్నారుల్లో కన్పించే లక్షణాలలో ముఖ్యంగా జ్వరం, దగ్గు, ముక్కు దిబ్బడ, రన్నింగ్ నోస్, గొంతు గరగర, వికారం, వాంతులు, గురక, శ్వాసలో ఇబ్బంది, ర్యాషెస్ వంటివి కన్పిస్తాయి. ఈ లక్షణాలు కన్పిస్తే పిల్లల్ని స్కూలుకు పంపించవచ్చు. ఓ వారం రోజులు ఇంట్లోనే ఉంచి వైద్యం చేయించాలి. ఒకవేళ ఈ లక్షణాలు 2-3 రోజులు దాటి కన్పిస్తే వెంటనే వైద్యుని సంప్రదించాల్సి ఉంటుంది. ఇంట్లోనే ఉంచి నీళ్లు ఎక్కువగా తాగించాలి. ముఖ్యంగా లెమన్ వాటర్ చాలా మంచిది. ఎప్పుడు ఈ తరహా లక్షణాలు కన్పించినా లెమన్ వాటర్ ఇవ్వడం బెస్ట్ ఆప్షన్. తీవ్రమైన చలి వాతావరణం నుంచి కాపాడుకోవాలి. లేకపోతే వైరల్ ఇన్‌ఫెక్షన్లు త్వరగా సంక్రమిస్తాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 మధ్యలో వారానికి ఒకసారైనా 40 నిమిషాలసేపు సన్ బాత్ చేయించాలి. ఫలితంగా విటమిన్ డి లెవెల్స్ పెరుగుతాయి.


సాధారణ సెలైన్ వాటర్‌తో ముక్కు రంధ్రాలు శుభ్రపర్చుకోవడం మంచిది. గోరు వెచ్చని నీటిలో ఉప్పు కలిపి గొంతు గరగర చేయాలి. రోజూ రాత్రి పడుకునే ముందు అలవర్చుకోవాలి. విటమిన్ డి, విటమిన్ సి, విటమిన్ బి12 క్రమం తప్పకుండా తీసుకునేట్టు చేయాలి. ఫలితంగా ఇమ్యూనిటీ బలపడుతుంది. బర్గర్లు, పిజ్జాలు, పాస్తా, పానీ పూరి, కేక్స్, హై షుగర్ ఫుడ్స్, వంటి బయటి ఫుడ్స్‌కు దూరంగా ఉంచాలి. సాధారణంగా వైరల్ ఇన్‌ఫెక్షన్లు ఉన్నప్పుడు యాంటీ బయాటిక్స్ కీలకం. కానీ పిల్లల గట్ ఇమ్యూనిటీపై ఇవి ప్రభావం చూపించడం వల్ల వీలైనంతవరకూ దూరంగా ఉండటం మంచిది. 


ఈ చిట్కాలు, సూచనలు పాటించడం ద్వారా హెచ్ఎంపీవీ వైరస్ సంక్రమణ ముప్పుతో పాటు ఇతర వైరల్ ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడుకోవచ్చు. 


Also read: HMPV Symptoms: హెచ్ఎంపీవీ వైరస్ అంటే ఏంటి, ఎలా వ్యాపిస్తుంది, లక్షణాలేంటి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.