Cholesterol Control Tips: ఈ చిన్న చిన్న ఆహార పదార్థాలతో చెడు కొలెస్ట్రాల్‌ను 8 రోజుల్లో వెన్నలా కరిగించవచ్చు..
Cholesterol Control 8 Days: ప్రస్తుతం చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్లే చాలా రకాల తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.
Cholesterol Control 8 Days: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటున్నారు. దీని కారణంగా చెడు కొలెస్ట్రాల్ సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా చాలా మంది ప్రస్తుతం ఫస్ట్ ఫుడ్ కూడా తింటున్నారు. ఇప్పటికే కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి ఆహారాలు తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ ఈ ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది:
ప్రతి రోజూ ఒక యాపిల్ పండును తినడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణాలు తగ్గ.. గుండె పోటు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ ఒక యాపిల్ పండు తీసుకోవాల్సి ఉంటుంది.
వోట్స్‌లో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి వీటిని ప్రతి రోజూ తినడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. రోజూ ఉదయాన్నే ఓట్స్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. అంతేకాకుండా శరీరంలో పేరుకుపోయిన ఎల్‌డిఎల్ కూడా తగ్గుతాయి.
డ్రై ఫ్రూట్స్ కూడా శరీరానికి చాలా రకాల పోషకాలను అందజేస్తాయి. కాబట్టి ప్రతి రోజూ డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. ఇందులో ఫైబర్, ప్రొటీన్, విటమిన్-ఇ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి కొలెస్ట్రాల్‌ను కరిగించడానికి ప్రభావవంతంగా సహాయపడుతుంది.
గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. గ్రీన్ టీలో కెఫిన్ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి చెడు కొలెస్ట్రాల్‌ను సులభంగా నియంత్రించడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Tax Saving Schemes 2023: ఈ పథకంలో పెట్టుబడి పెట్టండి.. ఆదాయంతోపాటు సూపర్ బెనిఫిట్స్
Also Read: Shubman Gill: ఉప్పల్‌లో పరుగుల ఉప్పెన.. చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి