Cholesterol Lowering Oil: లెమన్‌గ్రాస్ గురించి అందరికీ తెలిసిందే చాలా మంది ఇప్పుడు దీనిని వినియోగిస్తున్నారు. ఇందులో చాలా రకాల ఔషధ గుణాలుండడం వల్ల దీనిని ఔషధ మొక్కగా పిలుస్తారు. దీని వాసన నిమ్మకాయలా వస్తున్నందున నిమ్మగడ్డిగా పిలుస్తారు. ఇందులో ఉండే గుణాలు చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. అంతేకాకుండా శరీరంపై ప్రభావవంగా పని చేస్తుంది. అయితే మార్కెట్‌లో దీనికి సంబంధించిన నూనె కూడా లభిస్తుంది. ప్రస్తుతం దీనిని చాలా మంది వినియోగిస్తున్నారు. ముఖ్యంగా ఆయుర్వేదంలో ఈ నూనెతో   అరోమాథెరపీ చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.  ఈ నూనె వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ ఎలా నియంత్రణలో ఉంటుందో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లెమన్‌గ్రాస్ ఆయిల్ చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది:


నిమ్మగడ్డి నూనెలో సిట్రల్ అనే సమ్మేళనం అధిక పరిమాణంలో ఉంటాయి. ఇది శరీరం నుంచి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి ప్రభావవంతంగా కృషి చేస్తుంది. ఈ ఆయిల్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మాత్రమే కాకుండా.. యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి ఔషధంలా పనిచేస్తాయి. ఇందులో ఉండే గుణాలు మధుమేహాన్ని కూడా నియంత్రిస్తాయని నిపుణులు తెలుపుతున్నారు.


దీనిని ఎలా వినియోగించాలి:


లెమన్ గ్రాస్ ఆయిల్‌ను హెర్బల్ టీ రూపంలో డైట్‌లో చేర్చుకోవాలి. ఈ నూనెను వేడి నీటిలో 2 చుక్కలు వేసి తీసుకోవచ్చు. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా  రక్తపోటును కూడా నియంత్రించేందుకు సహాయపడుతుంది. అయితే  కొన్ని చుక్కల లెమన్‌గ్రాస్ ఆయిల్‌, ఆలివ్ ఆయిల్‌తో కలిపి సలాడ్ డ్రెస్సింగ్‌గా కూడా వినియోగించవచ్చు.


ఈ ఆయిల్‌ను ఎలా తయారు చేసుకోవాలి:


లెమన్ గ్రాస్ ఆయిల్‌ను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. దీని కోసం లెమన్ గ్రాస్ ప్లాంట్‌ను తీసుకుని బాగా శుభ్రం చేసుకోవాలి. దీని కోసం కొబ్బరి నూనెను కూడా తీసుకోవాలి. కొబ్బరి నూనెలో ఈ గ్రాస్‌ని వేసి  2 రోజులు మూసి ఉంచిన తర్వాత.. మరో 2 రోజులు ఎండలో ఉంచాలి. అప్పుడు ఆ నూనె నిమ్మ వాసన రావడం మొదలవుతుంది. అయితే ఇలా తయారు అయిన తర్వాత 2 రోజులు ఎండలో ఉంచాలి.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Telangana Rains Live Updates: హైదరాబాద్‌లో అర్ధరాత్రి కుండపోత వాన... ఆ జిల్లాలకు ఇవాళ భారీ వర్ష సూచన


Also Read : Sravana Remedies 2022: పరమేశ్వరుడు మీ కోరికలు నెరవేర్చాలంటే... ఆగస్టు 11లోపు ఈ చిన్న పని చేస్తే చాలు!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook