Cholesterol Lowering Superfoods: ఈ ఆహారాలను క్రమంగా తీసుకుంటే.. కేవలం 12 రోజుల్లో చెడు కొలెస్ట్రాల్ వెన్నెల కరగడం ఖాయం..
Cholesterol Lowering Superfoods: రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు దారీ తీయోచ్చు. అయితే దీని కోసం అందరూ సూపర్ ఫుడ్‌గా భావించే పలు రకాల ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది.
Cholesterol Lowering Superfoods: శరీరంలో కొలెస్ట్రాల్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి చెడు కొలెస్ట్రాలైతే, మరొకటి మంచి కొలెస్ట్రాల్. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పరిమాణాలు పెరగడం వల్ల శరీరానికి ప్రయోజనాలు కలుగుతాయి. అయితే బాడీలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ అధిక పరిమాణంలో పెరగితే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి కొలెస్ట్రాల్ పెరగడాన్ని ముందే గమనించి ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా మంచిదని నిపుణులు తెపుతున్నారు. అంతేకాకుండా శరీరంలో కొలెస్ట్రాల్‌ను నియంత్రించే ఈ ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కొలెస్ట్రాల్‌లో 2 రకాలు ఉన్నాయి:
తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (LDL) - దీనిని చెడు కొలెస్ట్రాల్ అని కూడా అంటారు.
అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (HDL) - మంచి కొలెస్ట్రాల్ అని అంటారు.
చెడు కొలెస్ట్రాల్ స్థాయి ఎలా ఉండాలి?
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తెలుసుకునేందుకు తప్పకుండా లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది.
LDL స్థాయి 100 కంటే తక్కువగా ఉంటే ఆందోళన చెందాల్సిన పని లేదు.
-శరీరంలో ఎలాంటి సమస్య లేని వారికి 100 నుంచి 129 mg/dL ఉంటుంది.
-130 నుంచి 159 mg/dL ఉంటే అధిక స్థాయిగా చెప్పొచ్చు.
-160 నుంచి 189 mg/dL ఇంకా అధిక స్థాయి.
-190 నుంచి 200mg/dL ఉంటే గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.
చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే 10 ఆహారాలు:
చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవడానికి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా వీరు రోజూ తీసుకునే ఆహారంలో తప్పకుండా పలు రకాల ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. అయితే ఈ కింద పేర్కొన్న ఆహారాలను తీసుకుంటే సులభంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా తీసుకునే ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను కూడా తీసుకోవాల్సి ఉంటుంది.
వీటిని ఆహారంలో తీసుకోండి:
1. ఓట్స్
2. బార్లీ
3. తృణధాన్యాలు
4. చిక్కుళ్ళు
5. వంకాయ
6. ఓక్రా
7. నట్స్
8. కనోలా ఆయిల్
9. సోయా ఆధారిత ఆహారం
10. చేపలు
కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి ఇతర మార్గాలు:
ఆరోగ్యకరమైన ఆహారాలతో పాటు తప్పకుండా వ్యాయామాలు చేయాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఉన్నవారు తప్పకుండా జీవన శైలిలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.
1. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి.
2. రెగ్యులర్‌గా వ్యాయామం చేయాలి.
3. ధూమపానం మానేయండి.
4. బరువును తగ్గించుకోండి.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE TELUGU NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also read: Jobs in Indian Army: ఇండియన్ ఆర్మీ నుంచి జాబ్ నోటిఫికేషన్.. వీరు కూడా అప్లై చేసుకోవచ్చు..
Also read: Jobs in Indian Army: ఇండియన్ ఆర్మీ నుంచి జాబ్ నోటిఫికేషన్.. వీరు కూడా అప్లై చేసుకోవచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook