మన కిచెన్‌లో లభించే వివిధ రకాల మసాలా దినుసుల్లో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. సక్రమంగా వినియోగిస్తే చాలు..అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ముఖ్యమైంది దాల్చినచెక్క.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దాల్చినచెక్క అనేది వంటల్లో తప్పకుండా ఉపయోగించే మసాలా దినుసు. ఇది మీ ఆహారం రుచిని పెంచుతుంది. అంతేకాకుండా ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలున్నాయి. దాల్చినచెక్కలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలం. ఫలితంగా చాలా రకాల వ్యాధుల్ని, ఇబ్బందుల్ని దూరం చేస్తుంది. దాల్చినచెక్క గుణం వేడి చేసేది కావడంతో..చలికాలంలో హాయిగా వినియోగించవచ్చు. దాల్చినచెక్కను పరిమిత మోతాదులో వినియోగిస్తే..అద్భుత ప్రయోజనాలుంటాయి.


జీర్ణక్రియలో ఉపయోగం


దాల్చినచెక్కలో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాలు జీర్ణానికి సంబంధించిన సమస్యల్ని దూరం చేస్తాయి. దాల్చినచెక్క తినడం వల్ల అజీర్తి సమస్య దూరమౌతుంది. 


మధుమహం నియంత్రణలో


దాల్చినచెక్క..మధుమేహం నియంత్రణలో కీలకంగా ఉపయోగపడుతుంది. దాల్చినచెక్క...బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను తగ్గిస్తుంది. రోజూ చిటికెడు దాల్చినచెక్క పౌడర్‌తో మధుమేహాన్ని నియంత్రించవచ్చు.


గుండెకు ప్రయోజనం


దాల్చినచెక్క కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. దాల్చినచెక్క తినడం వల్ల శరీరంలో కొవ్వు పెరగదు. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దాల్చినచెక్కతో గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. బ్లడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. 


దాల్చినచెక్కను బరువు తగ్గించడంలో ఉపయోగిస్తారు. బరువు తగ్గేందుకు దాల్చినచెక్క పౌడర్ చాలా బాగా పనిచేస్తుంది. చలికాలంలో దాల్చినచెక్క పౌడర్ తీసుకోవడం వల్ల ఇర వ్యాధులు సంక్రమించవు. దాంతోపాటు స్థూలకాయం సమస్యకు చెక్ పెట్టవచ్చు.


దాల్చినచెక్కను స్వెల్లింగ్ నియంత్రించేందుకు ఉపయోగిస్తారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు స్వెల్లింగ్ తగ్గిస్తాయి. చిటికెడు దాల్చినచెక్క పౌడర్‌ను గోరు వెచ్చని నీటిలో కలిపి తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.


జాయింట్ పెయిన్స్ తగ్గించేందుకు దాల్చినచెక్క అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఇందుకు దోహదపడతాయి. జాయింట్ పెయిన్స్, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.


Also read: Home Remedies: జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులకు అద్భుతమైన చిట్కాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook