కాక్‌టైల్ వ్యాక్సినేషన్ ప్రక్రియ మంచిది కాదంటున్న సీరమ్ ఛైర్మన్ సైరస్ పూనావాలా

Corona Cocktail Vaccination: కరోనా వ్యాక్సినేషన్ విషయంలో కొత్త కొత్త ప్రయోగాలు ఇంకా కొనసాగుతున్నాయి. రెండు వేర్వేరు కంపెనీల వ్యాక్సిన్లు ఒకే వ్యక్తికి ఇవ్వడం సరైందా లేదా అనే విషయంపై చర్చ జరుగుతున్న నేపధ్యంలో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఛైర్మన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Corona Cocktail Vaccination: కరోనా వ్యాక్సినేషన్ విషయంలో కొత్త కొత్త ప్రయోగాలు ఇంకా కొనసాగుతున్నాయి. రెండు వేర్వేరు కంపెనీల వ్యాక్సిన్లు ఒకే వ్యక్తికి ఇవ్వడం సరైందా లేదా అనే విషయంపై చర్చ జరుగుతున్న నేపధ్యంలో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఛైర్మన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
కరోనా వ్యాక్సినేషన్(Corona Vaccination) అందుబాటులో వచ్చాక..వ్యాక్సినేషన్ ప్రక్రియపై వివిధ రకాల పరిశోధనలు, ప్రయోగాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకే వ్యక్తికి రెండు వేర్వేరు కంపెనీల కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చే విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విధానాన్ని కాక్‌టైల్ వ్యాక్సినేషన్‌గా పిలుస్తారు. ఇప్పుడీ అంశంపై సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(Serum Institute) ఛైర్మన్ డాక్టర్ సైరస్ పూనావాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఒకే వ్యక్తికి రెండు వేర్వేరు కంపెనీల వ్యాక్సిన్ ఇవ్వడాన్ని అంటే కాక్‌టైల్ వ్యాక్సినేషన్‌కు(Cocktail vaccination) తాను వ్యతిరేకమని డాక్టర్ సైరస్ పూనాలాలా(Dr Cyrus Poonawalla) స్పష్టం చేశారు. వ్యాక్సిన్ల మిశ్రమంపై ప్రయోగాలకు అనుమతులిచ్చిన అంశంపై ఆయన స్పందించారు. ఇలా రెండు రకాల వ్యాక్సిన్లు ఇచ్చాక మెరుగైన ఫలితాలు రాకపోతే..ఇతర కంపెనీ వ్యాక్సిన్ మంచిది కాదనే అవకాశముందని తెలిపారు. రెండు వ్యాక్సిన్ల మిశ్రమాల ఫలితాలపై సరైన డేటా కూడా లేదనే విషయాన్ని సైరస్ పూనావాలా గుర్తు చేశారు. మరోవైపు మోదీ ప్రభుత్వం(Modi government)పై ప్రశంసలు కురిపించారు. మోదీ ప్రభుత్వం అధికారంలో వచ్చాక దేశంలో రెడ్ టేపిజం, లైసెన్స్ రాజ్ చాలావరకూ తగ్గిపోయాయని కొనియాడారు. గతంలో పారిశ్రామిక రంగం అధికారుల కాళ్లపై పడే పరిస్థితులుండేవని..ఇప్పుడా పరిస్థితి లేదని చెప్పారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్(Covishield) యుద్ధ ప్రాతిపదికన మార్కెట్‌లో రావడమే దీనికి నిదర్శనమన్నారు.
Also read: కొవ్వు కరిగించే మందుతో కరోనా వైరస్‌కు చెక్, తాజా అధ్యయనంలో ఆసక్తి కల్గించే విషయాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook