Coconut VS Lemon Water: కొబ్బరినీరు VS నిమ్మకాయనీరు.. ఎండకాలం శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా కాపాడేది ఏది?
Coconut VS Lemon Water: పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో మన శరీరాన్ని డీహైడ్రేషన్‌కు గురికాకుండా చూసుకోవడం మంచిది. మన ఆరోగ్యానికి కోకోనట్ వాటర్ లేదా నిమ్మకాయ రసం రెండిట్లో ఏది మంచిది?
Coconut VS Lemon Water: పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో మన శరీరాన్ని డీహైడ్రేషన్‌కు గురికాకుండా చూసుకోవడం మంచిది. మన ఆరోగ్యానికి కోకోనట్ వాటర్ లేదా నిమ్మకాయ రసం రెండిట్లో ఏది మంచిది? రెండిటిలో ఎందులో హైడ్రేషన్ గుణాలు ఎక్కువగా ఉంటాయి తెలుసుకుందాం.
కొబ్బరినీరు..
కొబ్బరి నీటిని నేచర్ స్పోర్ట్స్ డ్రింక్ అని కూడా పిలుస్తారు. ఇందులో ఎలక్ట్రోలైట్స్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మన శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. కొబ్బరినీటిలో పొటాషియం సోడియం, మెగ్నీషియం, క్యాల్షియం, ఎలక్ట్రోలైట్స్ మన శరీరానికి కావాల్సిన ఫ్లూయిడ్స్ సమతుల్యం చేస్తాయి. కండరాల పనితీరును కూడా మెరుగు చేస్తాయి.
అంతేకాదు కొబ్బరి నీటిలో కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. ఇవీ గ్లూకోస్, ఫ్రక్టోజ్ రూపంలో ఉండి శరీరానికి తక్షణ శక్తి నుంచి ఫిజికల్ యాక్టివిటీ ని పెంచుతుంది.
నిమ్మకాయ రసం..
నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కూడా మన శరీరాన్ని హైడ్రేటేడ్ గా ఉంచుతుంది. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. నిమ్మకాయ రసంలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ ఇమ్యూనిటీ పనితీరుకు సపోర్ట్ చేస్తాయి.అంతేకాదు చర్మాని కూడా ఆరోగ్యంగా ఉంచి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
నిమ్మరసంలో ఆల్కలైజింగ్ గుణాలు ఉంటాయి. రుచి చూడడానికి యాసిడిక్ గా ఉన్నా కానీ ఇది పీహెచ్ లెవెల్ ని సమతుల్యం చేసి కడుపులో యాసిటిటీ లెవెల్స్ ని తగ్గిస్తుంది.
ఇదీ చదవండి: మీ ఇంటి కిచెన్లోనే ఫ్యాటీ లివర్‌కు మందు.. జన్మలో రమ్మన్నారాదు..
కొబ్బరి నీరు నిమ్మకాయ రసం రెండిట్లో ఏది మంచిది?
ఎండాకాలం మన శరీరం హైడ్రేషన్ నిలపడానికి కొబ్బరి నీరు, నిమ్మరసం రెండిట్లో మంచి లక్షణాలు ఉంటాయి. కొబ్బరినీటిలో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి ఎండాకాలం మన శరీరం నుంచి బయటికి వెళ్లిపోతాయి. అంతేకాదు ఎండాకాలం జిమ్ చేసేవారు కొబ్బరి నీరు మంచి ఆప్షన్.పొటాషియం కంటెంట్ కూడా ఉంటుంది. ఇది డీహైడ్రేషన్ లోనవ్వకుండా కాపాడుతుంది కండరాల తిమ్మిరి పట్టకుండా చూస్తోంది. స్పోర్ట్స్ పర్సన్ డైట్ లో కొబ్బరి నీరు తప్పనిసరి.నిమ్మరసం నీటి విషయానికి వస్తే ఇందులో కూడా ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది రోజంతటికి కావాల్సిన హైడ్రేషన్ ఇస్తుంది. ఇందులో అనేక పోషకాలు కూడా ఉంటాయి. విటమిన్ సి కంటెంట్, యాంటీ ఆక్సిడెంట్ డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది.అంతేకాదు ఎండాకాలంలో ఇమ్యూనిటీ పనితీరుకు సహాయపడుతుంది. ఫ్రీ రాడికల్ సమస్యను రాకుండా చేస్తుంది.లెమన్ వాటర్ రుచి కూడా బాగుంటుంది కాబట్టి సులభంగా తాగేయొచ్చు. ఇది రోజంతటికి కావలసిన హైడ్రేషన్ ఇస్తుంది.
ఇదీ చదవండి: మీరు టాయిలెట్‌లో ఎక్కువసేపు గడిపితే ఈ ప్రతికూలతలు తెలుసుకోండి
ఇక కొబ్బరి నీరు లేదా నిమ్మరసం రెండిట్లో ఏది బెస్ట్ అంటే ఒక వ్యక్తి అవసరాలను బట్టి ఆధారపడి ఉంటుంది మీరు ఒకవేళ ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా చేస్తే కొబ్బరినీరు తీసుకోవడం మంచిది ఇందులో ఎలక్ట్రోలైట్ పుష్కలంగా ఉంటాయి. ఒకవేళ మీరు యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే పానీయాలను తీసుకోవాలనుకుంటే, ఇమ్యూనిటీ బూస్టింగ్ లాభాలు పొందాలంటే నిమ్మరసం బెస్ట్ ఆప్షన్.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook