High Cholesterol Symptoms: ఈ రెండు అంశాలు శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుదలను సూచిస్తాయి..!!
High Cholesterol Symptoms: ప్రస్తుత జీవనశైలి రోజురోజుకూ మరింత దిగజారుతోంది. రోజు ఒత్తిడి కారణంగా.. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినలేక పోతున్నారు. ఇది కొలెస్ట్రాల్‌తో సహా గుండె జబ్బులకు, స్ట్రోక్‌లకు దారితీస్తుంది.
High Cholesterol Symptoms: ప్రస్తుత జీవనశైలి రోజురోజుకూ మరింత దిగజారుతోంది. రోజు ఒత్తిడి కారణంగా.. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినలేక పోతున్నారు. ఇది కొలెస్ట్రాల్‌తో సహా గుండె జబ్బులకు, స్ట్రోక్‌లకు దారితీస్తుంది. అంతేకాకుండా ఊబకాయం, అధిక రక్తపోటు వంటి సమస్యలను కూడా పెంచుతుంది. మరోవైపు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు గోళ్ళలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు మీ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను సూచిస్తుంది. కొవ్వు పెరుగుదల కారణంగా గోళ్లలో ఏం మార్పులు వస్తాయో తెలుసుకుందాం.
గోళ్ల రంగు పసుపుగా మారుతుంది:
శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగినప్పుడు, గోళ్లలో మార్పులు జరిగి, పసుపు రంగులోకి మారుతుంది. ఇది శరీరంలో రక్త ప్రసరణ సరిగా లేదని సూచిస్తుంది. గోళ్ల రంగు పసుపు రంగులోకి మారడం.. లేదంటే గోళ్లలో పగుళ్లు ఏర్పడడం మొదలవుతుంది. అంతే కాదు గోళ్ల పెరుగుదల కూడా ఆగిపోతుంది.
చేతుల్లో నొప్పి:
శరీరంలో కొవ్వు పెరిగినపుడు అథెరోస్క్లెరోసిస్ అని పిలువబడే ధమనులను మూసుకుపోతాయి. కొలెస్ట్రాల్ శరీరంలో పేరుకుపోవడంతో అది చేతుల రక్తనాళాలపై ప్రభావం చూపుతుంది. దీని వల్ల చేతుల్లో నొప్పి మొదలవుతుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: White Hair Problem: తరచుగా జుట్టు తెల్లబడుతుందా..ఈ చిట్కాలు పాటించండి..!!
Also Read: White Hair Problem: చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతుందా..ఈ అలవాట్లు మానుకోండి..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.