White Hair Problem: చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతుందా..ఈ అలవాట్లు మానుకోండి..!!

White Hair Problem: మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది తెల్ల జుట్టు, వెంట్రుకలు రాలడం వంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారు.  ఒకప్పుడు తెల్ల జుట్టు సమస్యలు వృద్ధాప్యంలో మాత్రమే వచ్చేవి కానీ ఇప్పుడు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి నలుగురిలో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 5, 2022, 01:19 PM IST
  • చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతుందా..
  • అధికంగా టెన్షన్ పడకండి
  • సోమరితనం మానుకోండి
White Hair Problem: చిన్న వయసులోనే  జుట్టు తెల్లబడుతుందా..ఈ అలవాట్లు మానుకోండి..!!

White Hair Problem: మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది తెల్ల జుట్టు, వెంట్రుకలు రాలడం వంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారు.  ఒకప్పుడు తెల్ల జుట్టు సమస్యలు వృద్ధాప్యంలో మాత్రమే వచ్చేవి కానీ ఇప్పుడు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి నలుగురిలో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారు. తరచుగా టెన్షన్, ఇబ్బందికి గురికావడం వల్లే  ఈ సమస్యలు వస్తున్నాయని నిపుణులు పేర్కొన్నారు. అయితే ఈ సమస్యతో బాధపడుతున్న వారు రసాయనాలతో కూడిన హెయిర్ డై జుట్టు రంగులను వాడుతున్నారు. ఇది జుట్టుకు హాని కలిస్తుంది. 19 ఏళ్ల వయసు నుంచి 25 ఏళ్లు దాటిన తర్వాత జుట్టు తెల్లబడటం మొదలైతే..ఈ కథనం బాగా సహాయపడుతుంది.

ఈ అలవాట్ల వల్లే జుట్టు తెల్లబడుతుంది:

1. అనారోగ్యకరమైన ఆహారం:

చిన్న వయసులో ఉన్న వారు ఏ ఆహారం తీసుకోవాలో తెలియదు..మార్కెట్లలో లభించే ప్రతి  జంక్ ఫుడ్స్ తినడానికి ఇష్టపడతారు. వీటిలో నూనె పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. కావున ఇది కొలెస్ట్రాల్, బ్లడ్‌లోని షుగర్ స్థాయి దెబ్బతిస్తుంది. దీంతో పాటు జుట్టు సమస్యలు, ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. కావున ఆహారంలో కాల్షియం, జింక్, ఐరన్, కాపర్, ప్రొటీన్, విటమిన్లు వంటి పోషకాలకు ప్రాధాన్యత ఇవ్వండి.

2. అధికంగా టెన్షన్ పడకండి:

చదువుల్లో మార్పులు రావడం వల్ల చిన్న వయసులో ఒత్తిడికి గురవుతున్నారు. దీని వల్ల శరీరాన్ని ప్రభావితం చెంది. . చిన్న వయసులోనే వెంట్రుకలు కూడా తెల్లగా మారుతున్నాయి.

3. మద్యపానం:

అదే పనిగా మద్యం తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరం. ప్రధానంగా కాలేయంపై దీని ఎఫెక్ట్ ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ‌ అయితే ఈ చెడు అలవాట్లు కూడా జుట్టు తెల్లబడటానికి కారణం అవుతుంది

4. సోమరితనం:

సోమరితనం వల్ల కూడా తెల్ల జుట్టు వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. ఏం పని చేయకపోవడం వల్ల రక్తప్రసరణ తగ్గిపోయి. పోషకాహారం శిరోజాలకు చేరకపోవడం చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Weight Loss Tips: ఈ ఐదు రకాల ఆహారాలు తీసుకుంటే..బరువు సులభంగా తగ్గుతారు..!!

Also Read: Weight Loss Drinks: మీరు బరువు పెరుగుతున్నారా..అయితే ఈ డ్రింక్స్‌ను ట్రై చేయండి..!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News