Side effects of Grapes: ద్రాక్ష పళ్లంటే ఎవరికి చేదు. అందని ద్రాక్ష పుల్లన కావచ్చు కానీ అందినప్పుడు అందరికీ ఇష్టమే. పోషక పదార్ధాలు మెండుగా ఉండే ద్రాక్ష పండ్లతో కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని ఎంతమందికి తెలుసు. ఆ వివరాలు పరిశీలిద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సలాడ్, రైతా, మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ ఇలా ఏది తీసుకున్నా ద్రాక్ష పండ్లు కచ్చితంగా ఉంటాయి. ద్రాక్ష పండ్లలో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే ద్రాక్ష పండ్లను డైట్‌లో భాగంగా చేసుకుంటారు చాలామంది. అయితే పరిమితి దాటి తీసుకుంటే..చాలా రకాల దుష్పరిణామాలు ఉంటాయి. బరువు పెరగడంతో పాటు స్వీట్‌నెస్ వల్ల కిడ్నీ సమస్యలు ఎదురవుతాయంటున్నారు వైద్య నిపుణులు. ఈ నేపధ్యంలో ద్రాక్ష పండ్ల అమితంగా తీసుకుంటే కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటనేది పరిశీలిద్దాం.


డయేరియా


ఎక్కువ పరిమాణంలో ద్రాక్ష పండ్లు తీసుకోవడం వల్ల బాడీలో సుగర్ పెరిగి డయేరియాకు దారి తీయవచ్చు. ద్రాక్షలో ఉండే షుగర్ కారణంగా విరేచనాలు పట్టుకోవచ్చు. ఒకవేళ మీకు కడుపులో ఏమైనా సమస్య ఉంటే మాత్రం ద్రాక్ష పండ్లు తీసుకోకపోవడమే మంచిది.


దీర్ఖకాలిక కిడ్నీ వ్యాధులు


డయాబెటిస్ లేదా దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులతో బాధపడేవారు ద్రాక్ష పండ్లు అస్సలు తీసుకోకూడదు. ఎక్కువ పరిమాణంలో ద్రాక్ష పండ్లు తినడం వల్ల వివిధ రకాల కిడ్నీ సమస్యలు తలెత్తుతాయి. శరీరంలో షుగర్ లెవెల్స్ పెరగడానికి దోహదపడతాయి. ఇది డయాబెటిస్, కిడ్నీ ఇబ్బందులకు దారి తీస్తుంది. 


బరువు పెరగడం


బరువు పెరగడమనేది శీతాకాలంలో ప్రధానంగా ఎదురయ్యే సమస్య. ద్రాక్ష పండ్లలో అధిక మొత్తంలో ఉండే కేలరీల కారణంగా బరువు పెరుగుతాము. డైట్‌లో అధిక మొత్తంలో ద్రాక్ష పండ్లుంటే..కొన్ని కిలోల బరువు పెరగడానికి అవకాశాలున్నాయి. ద్రాక్షలో ఉండే ప్రోటీన్, ఫైబర్, ఫ్యాట్, కాపర్, విటమిన్ కే, థయామిన్‌లు కూడా పరిమితికి మించితే మంచిది కాదు. 


గర్భిణీలకు మంచిది కాదు


ద్రాక్షలో, రెడ్ వైన్‌లో  అధిక మొత్తంలో ఉండే పోలీఫెనాల్స్ కారణంగా కాలేయ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఇది తల్లికి, బిడ్డకు మంచిది కాదు. అందుకే గర్భిణీ స్త్రీలు ద్రాక్ష పండ్లకు దూరంగా ఉండటం మంచిది.


ఎలర్జీకి కారణం


ద్రాక్ష పండ్లు ఎలర్జీని పెంచుతాయి. ఇందులో ఉండే లిక్విడ్ ప్రోటీన్ ట్రాన్స్‌ఫెరేస్ అనే ప్రోటీన్ కారణంగా ఎలర్జీ ప్రభావం పెరుగుతుంది. ఫలితంగా దురద, రెడ్‌నెస్, నోటి పూత వంటివి ఎలర్జీ లక్షణాలు కన్పిస్తాయి. ద్రాక్ష పండ్లు ప్రాణాంతకమైన ఎలాఫిలాక్సిక్‌కు దారి తీయవచ్చు.


Also read: Low BP Symptoms, Remedies: లో బీపీ లక్షణాలు ఏంటి ? ఎలా బయటపడాలి ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.