Foxtail Millet Benefits: కొర్రలతో తయారుచేసిన పాయసంతో శరీరానికి ఇన్ని లాభాలా..
Foxtail Millet Benefits: కొర్రలతో తయారుచేసిన పాయసాన్ని ప్రతిరోజు అల్పాహారంలో భాగంగా తీసుకోవడం వల్ల అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీరాన్ని దృఢంగా చేసేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఎప్పుడైనా మీరు కొర్రలను చూశారా?
Foxtail Millet Benefits: చిరుధాన్యాల్లో అత్యంత ప్రాధాన్యత పొందిన కొర్రలు ఇప్పుడు మార్కెట్లో సులభంగా లభిస్తున్నాయి. ఆధునిక జీవనశైలిని పాటించడం వల్ల వస్తున్న అనారోగ్య కారణాలవల్ల చాలామంది చిరుధాన్యాలను తినేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇందులో భాగంగానే కుర్రల వినియోగం కూడా భారీగా పెరిగిపోయింది. అయితే దీనితో తయారు చేసిన ఆహారాలను ప్రతిరోజు తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు జీర్ణక్రియ సమస్యలను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. తరచుగా పొట్ట సమస్యలతో బాధపడేవారు కర్రలతో తయారుచేసిన ఆహారాలను తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇవే కాకుండా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మధుమేహం సమస్యలతో బాధపడేవారు అల్పాహారంలో భాగంగా కొర్రలతో తయారుచేసిన పాయాసాన్ని తాగడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా రక్తంలోని చక్కెర పరిమాణాలు తగ్గి డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా శరీరం యాక్టివ్ గా దృఢంగా మారుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అల్పాహారంలో వీటి పిండితో తయారుచేసిన రోటీలను తీసుకోవడం వల్ల ఇతర దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారు.
Also Read: Old City Metro Project: ఓల్డ్ సిటీ మెట్రోకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్.. మంత్రి కేటీఆర్ ట్వీట్
ఆధునిక జీవనశైలి కారణంగా చాలామందిలో గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి. దీని కారణంగా చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ప్రతిరోజు కొర్రలతో తయారుచేసిన ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. రక్తంలోని పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి కూడా సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
అధిక బరువు సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా కొర్రలతో తయారుచేసిన ఆహారాలు ప్రభావంతంగా సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేగంగా బరువు తగ్గడానికి కొర్రలతో తయారుచేసిన పాయసం లేదా రోటీలను ప్రతిరోజు అల్పాహారంలో చేర్చుకుంటే మంచి ఫలితాలు పొందడమే కాకుండా ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు శరీరాన్ని దృఢంగా చేసేందుకు కూడా దోహదపడతాయి. వీటిని ప్రతిరోజు వ్యాయామాలు చేసేవారు తీసుకోవడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు పొందుతారు.
Also Read: Old City Metro Project: ఓల్డ్ సిటీ మెట్రోకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్.. మంత్రి కేటీఆర్ ట్వీట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి