Uses Of Pomegranate Peel: చాలా మంది దానిమ్మ పండును వారి డైట్‌ ప్లాన్‌లో భాగంగా తింటు ఉంటారు. దీని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలు శరీరానికి అందుతాయి. దానిమ్మ పండు తినడం వల్ల రక్తకణాలు అభివృద్ధి చెందుతాయి. దీని వల్ల గుండెసమస్యలు, డయాబెటిస్‌ వంటి సమస్యలు దూరం చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.అయితే ఈ పండు తొక్కతో కూడా ఎన్నో లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దానిమ్మపండు తొక్కతో కలిగే లాభాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

> దానిమ్మ తొక్కలో వివిధ రకాల పోషకాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా ప్రోటీన్‌, పొటాషియం, కాల్షియం వంటి ఆరోగ్యకరమైన లక్షణాలు  ఉన్నాయి. దానిమ్మ తొక్కలో వల్ల అనారోగ్య కరమైన వ్యాధులను తొలిగించుకోవచ్చు. దీని తొక్కులు యాంటీ బాక్టీరియల్‌  లక్షణాలతో కలిగే జబ్బులను నివారిచగలదని నిపుణులు చెబుతున్నారు.


> దానిమ్మ తొక్కవల్ల గుండె సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇది శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.


> దానిమ్మ తొక్కలను పొడిగా చేసుకొని ఇందులో తెనే,నిమ్మరసం కలిపి చర్మంపై రాసుకోవడం వల్ల ముఖంపై వచ్చే చర్మ సమస్యలను తగ్గిస్తుందని చర్మ నిపుణులు చెబుతున్నారు.


Also Read: Heart Health Tips: ఈ ఐదు టిప్స్ పాటిస్తే గుండె పదికాలాలు పదిలం, ఎలాగంటే


> దానిమ్మ తొక్కతో రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. 


> జీర్ణ సమస్యలను తగ్గించడంలో దానిమ్మ తొక్క ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. 


>  కీళ్లనొప్పలు, గొంతునొప్పి నుంచి  ఉపశమనం పొందాలి అంటే దానిమ్మ తొక్కలను మరిగించి జ్యూస్‌ చేసుకోవాలి. దీని వల్ల ఉపశమనం పొందవచ్చు.


ఈ విధంగా దానిమ్మ పండు తొక్కను ఉపయోగించడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటామని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.


Also Read: Honey Benefits: చలికాలంలో రోజూ తేనె తీసుకుంటే 5 అద్భుత ప్రయోజనాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter