Control BP with Fennel Water: హై బీపీని చిటికలో తగ్గించే సోంపు వాటర్.. అదెలాగంటే..?
Control BP with Fennel Water: అధిక రక్తపోటు సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ సోంపు నీటిని తాగడం వల్ల ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా దూరమవుతాయి.
Fennel Water Controls Blood Pressure: మనం అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకున్నప్పుడు పొట్ట సమస్యలు రావడం సర్వసాధరణం. అయితే ప్రస్తుతం చిన్న పెద్ద తేడా లేకుండా చాలా మంది పొట్ట సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా పలు రకాల ఇంటి చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా సోంపు గింజలను వినియోగించడం వల్ల సులభంగా జీర్ణక్రియ సమస్యలు కూడా దూరమవుతాయి. అయితే ఈ చిట్కాను వినియోగించడం వల్ల పొట్ట సమస్యలు తగ్గడమేకాకుండా శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
సోంపు గింజల ప్రయోజనాలు:
సోంపు గింజలతో శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా శరీరానికి చల్లదనం అందిచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.
ఇందులో యాంటీఆక్సిడెంట్స్ సమృద్ధిగా లభిస్తాయి. కాబట్టి అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది.
ఖాళీ కడుపుతో సోంపు నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:
ఉదయాన్నే ఖాళీ కడుపుతో సోంపు నీరు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. అంతేకాకుండా నోటి దుర్వాసనను తొలగిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా శరీరంలో నాడీ వ్యవస్థను మెరుగుపరచడానికి దోహదపడుతుంది. కాబట్టి తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా సోంపు నీరు తాగాల్సి ఉంటుంది. ఈ గింజల్లో పొటాషియం కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇవి రక్త ప్రసరణను స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది.
అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు రక్తపోటును నియంత్రిస్తాయి. ముఖ్యంగా గుండె పోటు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ నీటిని తాగాల్సి ఉంటుంది. అయితే ఈ సోంపు నీటిని ఖాళీ కడుపుతో తాగడం వల్ల గ్యాస్ట్రిక్-కడుపు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. రాత్రి భోజనం తర్వాత ఈ నీటిని తాగితే జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Delhi liquor Scam Case: ముగిసిన కవిత విచారణ, ఇవాళ మరోసారి ప్రశ్నించనున్న ఈడీ
Also Read: Rohit Sharma-Virat Kohli: కేవలం 2 రన్స్ మాత్రమే.. ప్రపంచ రికార్డు నెలకొల్పనున్న రోహిత్-కోహ్లీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook