కరోనా ఫస్ట్ వేవ్‌తో పోల్చితే సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరమైనది. నిపుణులు చెప్పిన దాని కన్నా అధిక రెట్లు కరోనా వేగంగా వ్యాపించింది. కోవిడ్19 మరణాలు సైతం అధికంగా సంభవించాయి. ప్రస్తుతం కరోనా తీవ్రతను ఎదుర్కొంటున్న దేశాలలో కరోనా కేసులలో, మరణాలలో భారత్ రెండో స్థానంలో ఉంది.  కరోనా వ్యాక్సినేషన్ వేగవంతం చేయడం తప్ప మహమ్మారిని అరికట్టేందుకు మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా థర్డ్ వేవ్ గురించి అప్పుడే ఆందోళన మొదలైంది. కరోనా తొలి, రెండో వేవ్‌(Corona Second Wave)లో టీనేజ్ దాటిన వారు, వయోజనులపై కోవిడ్19 ప్రభావం చూపింది. అయితే మరికొన్ని నెలల్లో సంభవించనున్న కరోనా థర్డ్ వేవ్ 14 ఏళ్లలోపు చిన్నారులపై ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్నారులలో సైతం కనిపించే కరోనా కొత్త లక్షణాలు ఇక్కడ అందిస్తున్నాం. పెద్దవారిలో కనిపించినట్లుగానే వీరిలో సైతం జ్వరం, తలనొప్పి, జలుబు, దగ్గు లాంటి లక్షణాలుంటాయని చెబుతున్నారు. హార్వడ్ హెల్త్ ప్రకారం.. కొన్ని రోజులపాటు జ్వరం, దద్దుర్లు, కళ్లల్లో రక్తం తగ్గడం, కడుపునొప్పి, ఆకలి లేకపోవడం, వాంతులు, డయేరియా, పగిలిన పెదవులు, పెదవులు ఎర్రబారటం, మెడ నొప్పి, కాళ్లు చేతులు వాపు, చికాకు, అతినిద్ర, అలసట లాంటి లక్షణాలు కనిపిస్తాయి.


Also Read: Remdesivir Injection: కరోనా బాధితులకు రెమిడెసివర్ ఇవ్వడాన్ని ఆపివేస్తారా, డాక్టర్ ఏమన్నారంటే


పెద్దవారి మాదిరిగా చిన్నారులకు కరోనా వ్యాక్సిన్ (COVID-19 Vaccine) లేని కారణంగా తల్లిదండ్రులు, సంరక్షకులు చిన్నారుల పట్ల జాగ్రత్తగా వ్యహరించాలి. కనుక పైన తెలిపిన కరోనా లక్షణాలు మీరు గుర్తిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. మరోవైపు చిన్నారులకు పోషకాహారం అందిస్తూ రోగనిరోధక శక్తి పెంచడానికి యత్నించాలి. కొన్ని అనారోగ్య లక్షణాలు చిన్నారులు నిమోనియా బారిన పడేందుకు దారితీస్తాయి. పెద్దవారిలో అయితే సమస్య సులభంగా గుర్తిస్తాం, కానీ చిన్నారులు సమస్య ఏంటన్నది చెప్పకుండా బాధపడతారు, ఏడుస్తుంటారు. కనుక కరోనా థర్డ్ వేవ్ ప్రారంభానికి ముందు నుంచే తల్లిదండ్రులు చాలా అప్రమత్తంగా ఉండాలి.


Also Read: Vaccine first dose తీసుకున్న తర్వాత కరోనా సోకితే ఏం చేయాలి ? Second dose ఎప్పుడు తీసుకోవాలి


ఏ జాగ్రత్తలు తీసుకోవాలి
చిన్నారులు మాస్కులు ధరించేలా చూసుకోవాలి. చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం నేర్పించాలి.


పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వాలి. విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి, విటమిన్ డి, కాల్షియం మరియు జింక్ లభించే ఆహారం ఇవ్వడం ద్వారా వారి రోగనిరోధక శక్తి పెరుగుతుంది.


ఇంటి వద్ద ఉన్నప్పటికీ చిన్నారులను శారీరక శ్రమ చేయడం నేర్పించాలి. వ్యాయామం, యోగాసనాలు వేయడం వారిలో నూతన ఉత్సాహాన్ని కలిగిస్తుంది.


పెద్దవారిలో ఏదైనా కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించిన సమయాలలో, ఐసోలేషన్‌కు వెళ్లాలి. చిన్నారులను పదే పదే కలవకూడదు. 


చిన్నారులలో పైన పేర్కొన్న కరోనా లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. రోజుల తరబడి లక్షణాలున్నాయంటే కచ్చితంగా డాక్టర్‌ను సంప్రదించి చికిత్స అందించాలి.


Also Read: COVID-19 For Diabetes Patient: డయాబెటిస్ పేషెంట్లకు కరోనా మరింత ప్రమాదకరం, ఈ జాగ్రత్తలు పాటించండి 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook