Corona Second Wave: ఛాతిలో నొప్పి కరోనా వైరస్ కొత్త లక్షణమా, నిపుణులు ఏం చెబుతున్నారంటే

Corona Second Wave:  కరోనా లక్షణాలు సైతం భారీగా మారాయి. తొలి వేవ్‌లో పొడి దగ్గు, వాసన మరియు రుచిని కోల్పోవడం, జ్వరం, తలనొప్పి లాంటి లక్షణాలు కనిపించేవి. ఫస్ట్ వేవ్‌తో పోల్చితే కరోనా కేసులు మూడింతలు పెరిగాయి. కోవిడ్19 మరణాలు సైతం భారీగా నమోదయ్యాయి. 

Written by - Shankar Dukanam | Last Updated : May 11, 2021, 02:10 PM IST
Corona Second Wave: ఛాతిలో నొప్పి కరోనా వైరస్ కొత్త లక్షణమా, నిపుణులు ఏం చెబుతున్నారంటే

Corona Second Wave: కరోనా సెకండ్ వేవ్‌లో వైరస్ తీవ్రత భారతదేశంలో అధికంగా ఉంది. ఫస్ట్ వేవ్‌తో పోల్చితే కరోనా కేసులు మూడింతలు పెరిగాయి. కోవిడ్19 మరణాలు సైతం భారీగా నమోదయ్యాయి. కరోనా లక్షణాలు సైతం భారీగా మారాయి. తొలి వేవ్‌లో పొడి దగ్గు, వాసన మరియు రుచిని కోల్పోవడం, జ్వరం, తలనొప్పి లాంటి లక్షణాలు కనిపించేవి.

కరోనా సెకండ్ వేవ్‌లో పొత్తి కడుపులో నొప్పి, కండ్ల కలక, నీళ్ల విరేచనాలు, తదితర లక్షణాలు గుర్తించారు. సెకండ్ వేవ్‌లో కొందరు పేషెంట్లలో ఛాతీలో నొప్పి వస్తున్నట్లు గుర్తించారు. ఇది కరోనా వైరస్(CoronaVirus) మరో కొత్త లక్షణమా అని ఆందోళన వ్యక్తమవుతోంది. ఛాతీలో నొప్పి రావడానికి కొన్ని కారణాలున్నాయి. శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు మాత్రం దీనిని కరోనా లక్షణమని మాత్రం పేర్కొనలేదు. కరోనా పాజిటివ్‌గా తేలిన పేషెంట్లలో ఛాతిలో నొప్పి రావడానికి ఈ కారణాలున్నాయి.

Also Read: Black Fungus Infection గుర్తిస్తే ఏం చేయాలో మార్గదర్శకాలు విడుదల చేసిన ICMR

కరోనా వైరస్ ఈ మధ్య కాలంలో కొన్ని పర్యాయాలు పరివర్తన చెందింది కాబట్టి, కనుక ప్రజలలో RT-PCR టెస్టుల ద్వారా కోవిడ్19 వైరస్ సోకిందా లేదా చెప్పడం సాధ్యపడటం లేదు. అదే సమయంలో కరోనా సంక్రమణ కొత్త లక్షణాలను తెలుసుకోవాలి. కరోనా సోకిన తొలి దశలో కొందరికి ఛాతిలో నొప్పి ఎందుకు వస్తుందో నిపుణులు వివరించారు.

పొడి దగ్గు (Dry Cough)
కరోనా సోకిన వారిలో కనిపించే సాధారణ లక్షణం పొడి దగ్గు. దీని ఫలితంగా మీ ఛాతిలో నొప్పి వస్తుంది.  మరీ ఎక్కువగా దగ్గడం వల్ల శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన అసౌకర్యం కలుగుతుంది. తద్వారా మీకు ఛాతిలో నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఆక్సిజన్ స్థాయి పెరిగేందుకు పల్స్ ఆక్సీ మీటర్(Pulse Oximeter) వినియోగాన్ని తెలుసుకుని బోర్లా పడుకుని ప్రోన్ టెక్నిక్ పాటించాలి.

ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్
కరోనా వైరస్ సోకిన వారిలో కొందరిలో ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ వస్తుంది. ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్‌లో ఈ లక్షణాలు అధికంగా కనిపిస్తున్నాయి. కోవిడ్19 బారిన పడిన వారిలో త్వరగా చెడిపోయే అవయవాలు ఊపిరితిత్తులు. ఇన్‌ఫెక్షన్ కారణంగా శ్వాస సంబంధిత సమస్యలు రావడంతో ఛాతిలో నొప్పి వస్తుందని వైద్యులు చెబుతున్నారు.

Also Read; RT-PCR Tests: ఆర్‌టీ-పీసీఆర్ టెస్టులు వీరికి చేయకూడదు, ICMR తాజా మార్గదర్శకాలు విడుదల

న్యుమోనియా (COVID-19 Pneumonia) 
కరోనా సెకండ్ వేవ్‌లో బాధితులలో కనిపిస్తున్న మరో ముఖ్య లక్షణం న్యుమోనియా. COVID-19 లక్షణాలు ముదిరిన వారిలో కొందరిలో న్యుమోనియాను గుర్తించారు. ఇన్‌ఫెక్షన్ కారణంగా శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయి. ఊపిరితిత్తుల లోపల ఉండే గాలి సంచులు ఎర్రగా మారి శ్వాస సమయంలో ఇబ్బంది తలెత్తుతుంది. దాని ఫలితంగానూ ఛాతిలో నొప్పి వస్తుంది.

Also Read: Corona Third Wave: కరోనా థర్డ్ వేవ్ తప్పదు, ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్న నిపుణులు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News