Vaccine Third Dose: కరోనా మహమ్మారి ఇప్పట్లో పోయేది కాదని నిపుణుల హెచ్చరిక. కరోనా వైరస్ నుంచి విముక్తి పొందాలంటే వ్యాక్సిన్ మూడవ డోసు తప్పదంటున్నారు వైద్య నిపుణులు. లేకపోతే కరోనా సంక్రమణ ఆగదంటున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో ప్రస్తుతం కరోనా వ్యాక్సినేషన్(Corona Vaccination) ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. దేశంలో కరోనా యాక్టవ్ కేసులు తగ్గుతున్నాయి. అదే సమంలో 6 రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు కొన్ని రాష్ట్రాల్లో వ్యాక్సిన్ కొరత ఇప్పటికీ వెంటాడుతోంది. మొదటి డోసు అందనివారు దేశంలో ఇంకా 60 శాతంపైనే ఉన్నారు. ఈ నేపధ్యంలో కరోనాను నియంత్రించాలంటే వ్యాక్సిన్ మూడవ డోసు తప్పనిసరి అంటున్నారు వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు. ఎందుకంటే కోవిడ్ రెండు వ్యాక్సిన్ డోసులు వేసుకున్న తరువాత కూడా కరోనా సోకుతోంది. కోవిడ్ కారణంగా మరణించినవారిలో సైతం రెండు డోసులు తీసుకున్నవాళ్లుంటున్నారు. అందుకే వ్యాక్సిన్ మూడవ డోసు తప్పదంటున్నారు. 


రెండు డోసులు తీసుకున్న తరువాత వైరస్ తనలో జన్యుమార్పులు చేసుకునే అవకాశముందని.వ్యాక్సిన్‌ను తట్టుకునే కొత్త వేరియంట్‌గా మారే అవకాశాలున్నాయనేది నిపుణుల వాదన. అటువంటి వైరస్‌ను ఎదుర్కోవాలంటే శరీరంలో ఎక్కువశాతం యాంటీబాడీలు(Antibodies) ఉండాలంటున్నారు. అందుకే కరోనా మూడవ డోసు తప్పదనే వాదన వస్తోంది. ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లు కరోనా వైరస్‌ను పూర్తిగా నియంత్రించలేకపోతున్నాయి. 2 డోసులు తీసుకున్నవారిలో కొద్దికాలం తరువాత యాంటీబాడీలు తగ్గిపోతున్నాయి. అందుకే మూడవ డోసు (Vaccine Third Dose)తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు. 


Also read: Vaccine Efficacy: కరోనా వ్యాక్సిన్లు సమర్ధవంతంగా పని చేయడం లేదంటున్న కన్సార్టియం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook