Covaxin Clearance: మేకిన్ ఇండియా వ్యాక్సిన్ కోవాగ్జిన్ విషయంలో మరో బ్యాడ్‌న్యూస్ ఇది. కోవాగ్జిన్‌కు అంతర్జాతీయంగా లభించాల్సిన క్లియరెన్స్ మరింత ఆలస్యం కానుంది. కోవాగ్జిన్ అంతర్జాతీయ క్లియరెన్స్ ఆలస్యానికి కారణమేంటి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో జరుగుతున్న వ్యాక్సినేషన్(Vaccination) ప్రక్రియలో సింహభాగం కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లదే. ఒకటి మేకిన్ ఇండియా వ్యాక్సిన్ కోవాగ్జిన్ అయితే రెండవది ఇండియాలో ఉత్పత్తి అవుతున్న ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ అభివృద్ధి చేసిన కోవిషీల్డ్. కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కు అంతర్జాతీయంగా క్లియరెన్స్ ఉన్నా..కోవాగ్జిన్‌కు మాత్రం అంతర్జాతీయ అనుమతి లభించలేదు. ఫలితంగా కోవాగ్జిన్ వ్యాక్సిన్ తీసుకున్నవారు విదేశాలకు వెళ్లాలనుకుంటే సమస్య ఎదురవుతోంది. ఈ నేపధ్యంలో అంతర్జాతీయ అనుమతి కోసం భారత్ బయోటెక్ కంపెనీతో పాటు భారతదేశ ప్రభుత్వం కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. 


డబ్ల్యూహెచ్‌వో(WHO)ఈయూ జాబితాలో కోవాగ్జిన్ లేకపోవడంతో ఇప్పుడు క్లియరెన్స్ తప్పనిసరిగా మారింది. ఎప్పటికప్పుడు ఈ ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్‌లో కోవాగ్జిన్(Covaxin) 77.8 శాతం సమర్ధవంతంగా పనిచేసిందని భారత్ బయోటెక్ ప్రకటించింది. క్లియరెన్స్ సంబంధిత పత్రాల్ని డబ్ల్యూహెచ్‌వోకు సమర్పించింది. అటు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సైతం సాధ్యమైనంత త్వరలో క్లియరెన్స్ లభిస్తుందని భావిస్తోంది. నేషనల్ ఎక్స్‌పర్ట్ గ్రూప్ ఆన్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ ఛైర్‌పర్సన్ డాక్టర్ వీకే పాల్ మాత్రం ఈ నెలాఖరులోగా క్లియరెన్స్ వస్తుందని తెలిపారు. కానీ టెక్నికల్ కారణాలతో ఈ ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఫలితంగా విదేశాలకు వెళ్లే భారతీయులు, విద్యార్ధులకు సమస్యలు ఎదురవుతున్నాయి. అక్టోబర్ 6న జరగనున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ స్ట్రాటజిక్ అడ్వైజరీ గ్రూప్ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ ఆన్ ఇమ్యునైజేషన్ భేటీలో కూడా కోవాగ్జిన్ క్లియరెన్స్‌పై(Covaxin International Clearance)స్పష్టత వచ్చే అవకాశాల్లేవు. 


అంతర్జాతీయ వైద్య విభాగమైన డబ్ల్యూహెచ్‌వో ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ జాబితాలో ఇప్పటి వరకూ ఫైజర్-బయోన్టెక్(Pfizer-Biontech), జాన్సన్ అండ్ జాన్సన్, మోడెర్నా(Moderna), సినోఫార్మ్ వ్యాక్సిన్లే ఉన్నాయి. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ(Oxford University) అభివృద్ది చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కు కొన్ని దేశాల్లో అనుమతి ఉంది. 


Also read: Corona New Variant: కరోనా వైరస్ కొత్త వేరియంట్, మరీ ప్రమాదకరమంటున్న శాస్త్రవేత్తలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి