Covid 19 home testing : ఇంట్లోనే కోవిడ్ టెస్ట్.. ఈ సూత్రాలు పాటిస్తే చాలు
Covid 19 home testing kit know about the app : ఐసీఎంఆర్ ఆమోదించిన హోమ్ కోవిడ్ టెస్ట్ చేసుకోవడం చాలా ఈజీ. యాప్ ఉంటుంది. దాని ద్వారా ఈజీగా టెస్ట్ చేసుకుని రిపోర్ట్ పొందొచ్చు.
Covid 19 home testing kit Here’s all you need to know about self testing kit app : భారత్‌తో పెరుగుతున్న కోవిడ్ -19 కేసులను దృష్టిలో ఉంచుకుని.. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇటీవల అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ (RAT) సెంటర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అలాగే ప్రజలు వారి ఇంట్లోనే స్వయంగా కోవిడ్ టెస్ట్ (Covid test) చేసుకునే వెసులుబాటు కూడా ఐసీఎంఆర్ (ICMR) కల్పించింది.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) కోవిడ్-19కు సంబంధించి చేయవలసినవి, చేయకూడని విషయాలను వెల్లడించింది. మీరు ఇంట్లోనే కోవిడ్ టెస్టింగ్ (Home Covid Testing) చేసుకుంటుంటే.. కొన్ని విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
హోమ్ కోవిడ్ టెస్ట్ (Home Covid Test) చేసుకునేందుకు ఇప్పుడు ఆన్‌లైన్, బయట స్టోర్స్‌లలో కిట్స్ లభిస్తున్నాయి. వాటి ద్వారా సులభంగా టెస్ట్ చేసుకోవచ్చు. ముక్కు ద్వారా సేకరించిన నమూనాను అప్పటికప్పుడు చెక్ చేసుకుని.. కోవిడ్ టెస్ట్ (Covid test) చేసుకోవచ్చు. నమూనాలను సేకరించాక అందుకు సంబంధించి ఫోటోను యాప్‌లలో క్యాప్చర్స్ చేస్తే చాలు. అక్కడే పాజిటివ్, నెగెటివ్ అనే రిపోర్ట్ కూడా వచ్చేస్తుంది.
ఐసీఎంఆర్ (ICMR) ఆమోదించిన హోమ్ కోవిడ్ టెస్ట్ చేసుకునేందుకు.. పలు కంపెనీల హోమ్ టెస్టింగ్ మొబైల్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store) యాపిల్ (Apple) స్టోర్‌లలో అందుబాటులో ఉన్నాయి. ముందుగా మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో దాని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
ఈ మొబైల్ యాప్స్ (Apps) ద్వారా మీరు హోమ్ కోవిడ్ టెస్ట్ సరైన విధంగా చేసుకునేందుకు గైడెన్స్ లభిస్తుంది. అలాగే కోవిడ్ పాజిటివ్, నెగెటివ్ రిపోర్ట్‌ను కూడా పొందొచ్చు. కోవిడ్ టెస్ట్ చేసుకున్న తర్వాత మీ స్మార్ట్ ఫోన్ నుంచి యాప్ ద్వారా టెస్ట్ స్ట్రిప్ ఫోటోను క్యాపర్చ్ చేయాల్సి ఉంటుంది. దీంతో డేటా అప్‌లోడ్ అవుతుంది.
ఇక టెస్ట్‌కు సంబంధించిన డేటా మొత్తం కూడా ICMR COVID-19 టెస్టింగ్ పోర్టల్‌కి కనెక్ట్ చేసిన మీ మొబైల్ ఫోన్ యాప్‌లోనే నిల్వ ఉంటుంది. అయితే సర్వర్‌లో డేటా క్యాప్చర్ అవుతుంది. కోవిడ్ హోమ్ టెస్ట్ చేసుకునేందుకు అప్‌లోడ్ చేసే డేటా గురించి సందేహపడాల్సిన అవసరం లేదు. ఆ డేటాకు గోప్యత ఉంటుందని ICMR పేర్కొంది. ప్రైవసీ గురించి ఆందోళన చెందాల్సిన అక్కర్లేదని తెలిపింది. మీ పేరు, పుట్టిన తేదీ, వయస్సు, చిరునామా, మొబైల్ నంబర్, వ్యాక్సినేషన్ స్టేటస్, ఆధార్ కార్డ్ మొదలైన వాటిని యాప్‌లో అందించాల్సి ఉంటుంది.
Also Read : Family suicide in Vijayawada: విజయవాడలో దారుణం- తెలంగాణ కుటుంబం ఆత్మ హత్య!
హోమ్ టెస్టింగ్ కిట్స్..
ఐసీఎంఆర్ (ICMR) ఆమోదించిన Mylab Discovery CoviSelf టెస్టింగ్ కిట్స్ ఇవే. PanBio COVID-19 యాంటిజెన్ రాపిడ్ టెస్ట్ డివైజ్, CoviFind COVID-19 రాపిడ్ సెల్ఫ్ టెస్ట్, ఆంగ్‌కార్డ్ కోవిడ్-19 హోమ్ టెస్ట్ కిట్, క్లినిటెస్ట్ COVID-19 యాంటిజెన్ సెల్ఫ్ టెస్ట్, అల్ట్రా కోవి-క్యాచ్ SARS-CoV-2 ( ULTRA Covi-Catch SARS-CoV-2) హోమ్ టెస్ట్, రాపిడ్ యాంటిజెన్ సెల్ఫ్ టెస్ట్.
Also Read : Vanama Raghava: రామకృష్ణను బెదిరించినట్లు అంగీకరించిన వనమా రాఘవ.. 14 రోజుల రిమాండ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి