Vanama Raghava: నాగ రామకృష్ణను బెదిరించినట్లు అంగీకరించిన వనమా రాఘవ..

ASP on Vanama Raghava arrest : పాల్వంచలో ఇటీవల కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డ నాగ రామకృష్ణను తాను బెదిరింపులకు గురిచేసినట్లు నిందితుడు వనమా రాఘవ అంగీకరించాడు.

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 8, 2022, 03:11 PM IST
  • రామకృష్ణను బెదిరించినట్లు అంగీకరించిన నిందితుడు రాఘవ
  • రాఘవపై మొత్తం 12 కేసులు
  • బాధితులు నిర్భయంగా ముందుకు రావాలని ఏఎస్పీ సూచన
Vanama Raghava: నాగ రామకృష్ణను బెదిరించినట్లు అంగీకరించిన వనమా రాఘవ..

ASP on Vanama Raghava arrest : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచకు చెందిన నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ఏ-2 నిందితుడు వనమా రాఘవ అరెస్ట్ వివరాలను ఏఎస్పీ రోహిత్ రాజ్ మీడియాకు వెల్లడించారు. విచారణలో వనమా రాఘవ రామకృష్ణను బెదిరించినట్లు అంగీకరించాడని తెలిపారు. ఇప్పటివరకూ అతనిపై 12 కేసులు నమోదయ్యాయని.. ఆ కేసులపై కూడా దర్యాప్తు జరుపుతామని పేర్కొన్నారు. పాత కేసుల వివరాలు కూడా రాబట్టామని... ప్రస్తుతం విచారణ జరుగుతున్నందునా అన్ని వివరాలు ఇప్పుడే వెల్లడించలేమని తెలిపారు.  వనమా రాఘవ బాధితులు ఇంకా ఎవరైనా ఉంటే నిర్భయంగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయవచ్చన్నారు.

భద్రాద్రి-ఏపీ సరిహద్దులో రాఘవ అరెస్ట్ :

భద్రాద్రి జిల్లాలోని దమ్మపేట మండలం మందలపల్లి... ఏపీ సరిహద్దు ప్రాంతమైన చింతలపూడికి మధ్య వనమా రాఘవను శుక్రవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. రాఘవతో పాటు అతనికి సహకరించిన డ్రైవర్, మరో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిజానికి గురువారమే (జనవరి 6) రాఘవను హైదరాబాద్‌లో అరెస్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ పోలీసులు ఆ ప్రచారాన్ని తోసిపుచ్చారు. ఘటన జరిగిన 4 ఐదు రోజులకు ఎట్టకేలకు రాఘవ పట్టుబడ్డాడు.

అసలేంటీ కేసు : 

నాగ రామకృష్ణకు, అతని సోదరి, తల్లితో చాలా కాలంగా ఆస్తి వివాదాలు నెలకొన్నాయి. పెద్ద మనుషుల సమక్షంలో ఆస్తి పంపకాలు జరిగినప్పటికీ తన వాటా తనకివ్వట్లేదని రామకృష్ణ తన సెల్ఫీ వీడియోలో ఆరోపించారు. ఆస్తి ఇవ్వకపోవడం, సంపాదన లేకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయినట్లు చెప్పాడు. ఇంతలో ఆస్తి వివాదంలో జోక్యం చేసుకున్న వనమా రాఘవ (Vanama Raghava) తనను బెదిరింపులకు గురిచేశాడని ఆరోపించారు. అంతేకాదు, ఆస్తి వివాదాన్ని పరిష్కరించాలంటే తన భార్యను పంపించాలంటూ ఏ భర్త వినకూడని మాటలు మాట్లాడాడని అన్నారు. తన చావుకు రాఘవ, సోదరి, తల్లి కారణమని ఆరోపించాడు. నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది.

Also Read: అక్కతో వనమా రాఘవకు అక్రమ సంబంధం.. సంచలనం రేపుతున్న నాగ రామకృష్ణ మరో సెల్ఫీ వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News