Curd Benefits On Hair: పెరుగు మన ఆరోగ్యానికి మాత్రమే కాదు, జుట్టుకు కూడా చాలా మేలు చేస్తుంది. పెరుగును జుట్టుకు అప్లై చేస్తే జుట్టుకు సంబంధించిన చాలా సమస్యలను అధిగమించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పెరుగులో బ్యాక్టీరియా స్థాయి అధికంగా ఉంటుంది. ఇవి శరీరంలో ఎంజైమ్‌లు ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. పెరుగు మాస్క్‌ జుట్టును ఫ్లెక్సిబుల్‌గా మార్చడానికి, ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడుతుంది.  దీంలో జుట్టు సిల్కీగా మారుతుంది. పెరుగులో మెంతి గింజలను గ్రైండ్ చేసి జుట్టుకు పట్టిస్తే జుట్టు రాలడం, జుట్టులో చుండ్రు, జుట్టు పొడిబారడం వంటి సమస్యలు తొలగిపోతాయి. కాబట్టి పెరుగును జుట్టుకు అప్లై చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పెరుగును జుట్టుకు అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు:


చుండ్రు:


జుట్టులో చుండ్రు సమస్య ఉంటే.. పెరుగుని జుట్టుకు అప్లై చేసి చుండ్రు సులభంగా తొలగించుకోవచ్చు.


తెల్లని జుట్టు:


చిన్న వయస్సులోనే  జుట్టు తెల్లగా మారితే..జుట్టుకు పెరుగును ఉపయోగించడం మంచిదని ఆయుర్వేద నిపుణులు పేర్కొన్నారు. దీని వల్ల జుట్టుకు పోషణ లభిస్తుందని తద్వారా నల్లగా మారుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


జుట్టు పెరుగుదల:


జుట్టు పెరగడంలో లోపం ఉంటే..జుట్టుకు పెరుగును అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల మీ జుట్టు చాలా బలంగా, పొడవుగా పెరుగుతుంది.


పొడి బారడం:


జుట్టు చాలా మందిలో పొడిగా, గజిబిజిగా ఉంటే.. పెరుగు జుట్టుకు క్రమం తప్పకుండా అప్లై  చేస్తే మృదువుగా, దృఢంగా మారుతుంది.


జుట్టుకు పెరుగును ఎలా అప్లై చేయాలి:


జుట్టుకు పెరుగును అప్లై చేయడానికి.. ముందుగా జుట్టును శుభ్రం చేసి ఆరబెట్టాలి. తర్వాత ఒక గిన్నెలో పెరుగు తీసుకొని.. చేతి లేదా బ్రష్ సహాయంతో మూలాలు వద్ద పేరుగును పూయాలి. 30 నిమిషాల తర్వాత జుట్టును సాధారణ నీటితో కడగాలి.


Also Read: Diabetes: డయాబెటిస్ సమస్యగా ఉందా..ఈ జ్యూస్‌లు తాగితే చాలు


Also Read: Coconut Water Benefits: వేసవిలో కొబ్బరినీళ్లు తాగితే ఈ అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు..!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి