Diabetes: డయాబెటిస్ రోగులు ఈ 3 రకాల మొక్కలతో బ్లడ్ షుగర్ ని నియత్రించుకోవచ్చు. డయాబెటిస్ రోగులు వారి ఆరోగ్య రక్షణకు ఎన్నో రకాల ఔషధాలతో పాటు.. ఇన్సులిన్ ఇంజక్షన్ ని కూడా తీసుకుంటారు. కానీ కొన్ని సహజమైన విధానాల ద్వారా డయాబెటిస్ ని నియత్రించవచ్చు. డయాబెటిస్ సాధారణంగా చెడు ఆహారపు అలవాట్లు మరియు అనారోగ్యకర జీవన శైలి వల్ల సంభవిస్తుంది. కొందరిలో ఇది వ్యాధి జన్యపరంగా కూడా సంభవిస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటి వరికు నిపుణులు డయాబెటిస్ కి సరైన చికిత్స ఇంతవరకు తెలుసుకోలేకపోయారు. ఆరోగ్యకరమైన జీవనశైలి మరియు డైట్ ని అనుసరించటం ద్వారా ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు. కొన్ని రకాల మొక్కల సహాయంతో షుగర్ స్థాయిలను నియంత్రించవచ్చు. భారతదేశానికి చెందిన ప్రముఖ ఆరోగ్య నిపుణులు నిఖిల్ వాట్స్ శరీరంలో గ్లూకోస్ స్థాయిని నియంత్రించే ఆకుపచ్చ మొక్కల గురించి 


కరివేపాకు.. 
సాధారణంగా కరివేపాకును దక్షిణ భారత వంటకాలలో ఉపయోగిస్తారు. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ కరివేపాకుతో టీని తయారు చేసుకొని తాగడం ద్వారా మధుమేహ రోగులకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.  


Also Read: CM KCR at Palamuru project: నార్లాపూర్ పంప్ హౌజ్ వద్ద మహా బాహుబలి మోటార్స్ ఆన్ చేసిన సీఎం కేసీఆర్


తిప్పతీగ.. 
కరోనా వచ్చిన వారిలో తిప్పతీగలోని మూలికలు రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడతాయి. కాకపొతే ఉదయాన్నే ఈ తిప్పతీగని తీసుకోవాలి. ఇది శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. 


వేప.. 
వేపలోని ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయని మన అందరికి తెలుసు. దీని ఆకులు, పండ్లు, పువ్వులు, బెరడు మరియు కలపను ఎన్నో ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. ఉదయాన్నే నిద్రలేచి దీని పచ్చి ఆకులను నమిలి తినడం ద్వారా గ్లూకోజ్ స్థాయి అదుపులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.


Also Read: Diabetes Tips: రోజూ ఇలా చేస్తే టైప్ 2 డయాబెటిస్ నివారణ చాలా సులభం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook