Cycling Benefits: మారుతున్న జీవనం కారణంగా చాలామంది జంక్ ఫుడ్ కు అలవాటు పడ్డారు. దీంతో 80 శాతం మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. జంక్ ఫుడ్ కారణంగా కొవ్వు అంతా పొట్ట, తొడల భాగాల్లో పేరుకుపోతుంది. అక్కడ ఏర్పడిన కొవ్వును తగ్గించుకోవడం అంత సులువు కాదు. దీని కోసం అనేక కసరత్తులు చేయాల్సి వస్తుంది. కానీ, ఒక్క సైక్లింగ్ చేయడం వల్ల పొట్ట, తొడల భాగాల్లో ఏర్పడిన కొవ్వును కరిగించుకునేందుకు అవకాశం ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అధిక బరువు తగ్గించుకునేందుకు చాలా మంది జిమ్ లో గంటల తరబడి సైకిల్ తొక్కుతారు. ఇలా చేయడం వల్ల బరువు నియంత్రణలోకి రావడం సహా శరీరానికి అనేక ప్రయోజనాలను కలుగజేస్తుంది. రోజూ సైక్లింగ్ చేయడం వల్ల జీవక్రియ రేటు పెరగడం సహా శరీరంలోని కండరాలు గట్టిపడతాయి. శరీరానికి బలం చేకూరుతుంది. 


కేలరీలను బర్న్ చేస్తుంది..


ఓ పరిశోధన ప్రకారం.. బరువు తగ్గడానికి వ్యాయామం చేయడం వల్ల కనీసం 2 వేల కేలరీలు బర్న్ చేయవచ్చు. దీంతో పాటు రోజూ సైక్లింగ్ చేయడం ద్వారా గంటకు 300 కేలరీలను బర్న్ చేసుకోవచ్చు. సైక్లింగ్ తో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది. 


రోజూ సైక్లింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు


తక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తే.. ఇతర వాహనాలకు బదులుగా సైకిల్ ను ఉపయోగించండి. సైక్లింగ్ చేయడం వల్ల బర్న్ చేయడమే కాకుండా ఎన్నో అనారోగ్య సమస్యలకు స్వస్తి చెప్పవచ్చు. 


సైక్లింగ్ వల్ల గుండె సంబంధిత వ్యాధులు, పక్షవాతం, మధుమేహం, తీవ్ర ఒత్తిడిని జయించవచ్చు. 


ఏ వయసు వారైనా సైక్లింగ్ చేయవచ్చు. సైక్లింగ్ వల్ల మానసిక రుగ్మతలను నివారిస్తుంది. 


(నోట్: పైన పేర్కొన్న సమాచారమంతా కొన్ని నివేదికల నుంచి గ్రహించబడింది. ఈ చిట్కాలను పాటించే ముందు సంబంధిత వైద్యుడ్ని సంప్రదించడం మంచిది. దీన్ని ZEE తెలుగు News ధ్రువీకరిచడం లేదు.)   


Also Read: Lemon Juice Benefits: నిమ్మరసం తాగడం వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?


ALso Read: Amla Hair Benefits: ఉసిరి కాయల వినియోగంతో తెల్ల జుట్టు మటుమాయం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.