Dandruff Home Remedies: మారుతున్న కాలానుగుణంగా చాలా మందిలో చుండ్రు సమస్యలు తలెత్తుతున్నాయి. చుండ్రు సమస్యలతో బాధపడే వారు దాని నుంచి బయటపడేందుకు అనేక నివారణ చర్యలను పాటిస్తున్నారు. అనేక బ్రాండ్స్ మార్కెట్లో రిలీజ్ చేసిన కృత్రిమ నివారణ చర్యలను పాటిస్తున్నారు. కానీ, కొన్ని నేచురల్ టిప్స్ వాడడం వల్ల కూడా చుండ్రు సమస్యను నివారించవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చుండ్రును వదిలించుకోవడానికి 5 సహజ మార్గాలు..


కొబ్బరి నూనె మేలు..


కొబ్బరి నూనె జుట్టుకు చాలా మేలు చేస్తుంది. కొబ్బరి నూనె స్కిన్ హైడ్రేషన్‌ను మెరుగుపరుస్తుంది. చుండ్రుకు ప్రధాన కారణం అయిన స్కాల్ప్‌ను పొడిగా ఉండకుండా చేస్తుంది. ప్రతిరోజూ నిద్రించే ముందు జుట్టుకు కొబ్బరి నూనె పూసుకొని.. ఉదయాన్నే షాంపూతో తలస్నానం చేస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది. 


టీ ట్రీ ఆయిల్ మంచిది!


కొబ్బరి నూనె కాకుండా, టీ ట్రీ ఆయిల్ జుట్టు ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది చుండ్రును వదిలించుకోవడానికి సహాయపడుతుంది. మీరు కొబ్బరి నూనెలో 2 నుంచి 3 చుక్కల టీ ట్రీ ఆయిల్ వేయాలి. తర్వాత ఈ నూనెను మీ తలకు పట్టించాలి.


అలోవెరా జెల్..


అలోవెరా జెల్‌తో జుట్టుకు ప్రయోజనం చేకూరుతుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది చుండ్రును వదిలించుకోవడానికి సహాయపడుతుంది. దీని కోసం.. మీరు అలోవెరా నుంచి జెల్ ను పొందవచ్చు. అలోవెరా జెల్‌ని తలకు పట్టించి 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు అలోవెరా జెల్ ను వాడడం వల్ల మేలు జరుగుతుంది. 


బేకింగ్ సోడాతో..


బేకింగ్ సోడాలో యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి. ఇది చుండ్రు నుండి ఉపశమనానికి సహాయపడుతుంది. మీరు తడిగా ఉన్న జుట్టుకు బేకింగ్ సోడాను అప్లై చేసి, తలపై 2 నుండి 3 నిమిషాల పాటు మసాజ్ చేసి, తర్వాత సున్నితమైన షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చుండ్రు నుంచి ఉపశమనం పొందవచ్చు.


నిమ్మరసం


నిమ్మరసం ఆమ్లంగా ఉంటుంది. ఇది ఫంగస్, చుండ్రును తగ్గిస్తుంది. దీని కోసం మీరు గిన్నెలో నిమ్మరసం తీసుకొని మృదువైన షాంపూతో తలను శుభ్రం చేసుకోవాలి. ఇలా రెండు వారాలు చేస్తే చుండ్రు సమస్య తగ్గిపోతుంది. 


(నోట్: పైన పేర్కొన్న సమాచారమంతా టిప్స్, నివారణ చర్యల నుంచి గ్రహించబడింది. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.)  


ALso Read: Mint Tea Benefits: వేసవిలో పుదీనా టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా?


Also Read: Curd Benefits For Hair: పెరుగుతో జుట్టుకు కలిగే ప్రయోజనాలేంటో తెలుసా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.