Dandruff Treatment at Home in Telugu: ప్రస్తుతం మారుతున్న అలవాట్లతో అనేక ఆరోగ్య సమస్యలతోపాటు జుట్టు కూడా త్వరగా రాలిపోతుంది. జుట్టు రాలిపోవడానికి చుండ్రు కూడా ఒక కారణంగా మారుతోంది. ముఖ్యంగా హెయిర్ స్టైల్ మంచిగా మెయింటెన్ చేయాలనుకునే వారు నెత్తినిండా చుండ్రుతో చాలా ఇబ్బందిపడుతున్నారు. చుండ్రుతో తలలో దురద పెడుతుండడంతో పదే పదే నెతి మీద చేతితో గోక్కొవాల్సి ఉంటుంది. నిరంతరం గోకడం వల్ల మీ వెంట్రుకల కుదుళ్లు దెబ్బతింటాయి. అంతేకాదు అప్పటివరకు చేస్తున్న పని మీద ఏకాగ్రత దెబ్బ తింటుంది. చుండ్రు సమస్య ఏ సీజన్‌లోనైనా రావచ్చు. అయితే ప్రస్తుత చలికాలంలో ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. చుండ్రును తొలగించేందుకు రసాయన ఆధారిత యాంటీ డాండ్రఫ్ షాంపులను యూజ్ చేస్తుంటారు. ఇలాంటి షాంపుల జోలికి పోకుండా సింపుల్‌గా మీ ఇంట్లోనే రెమిడిని తయారు చేసుకోవచ్చు. ఎలాగంటే..?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యాపిల్ సైడర్ వెనిగర్


యాపిల్ సైడర్ వెనిగర్ యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. ఇది చుండ్రుకు కారణమైన ఫంగస్‌ను తొలగించేందుకు ఉపయోపడుతుంది. ఒక గిన్నెలో నీరు, ఆపిల్ సైడర్ వెనిగర్‌ సమాన భాగాలుగా కలపాలి. ఆ ద్రావణాన్ని మీ తలకు పట్టించండి. 15-20 నిమిషాలు ఆరిన తరువాత.. తలను శుభ్రం చేసుకోండి. స్కాల్ప్ pHని సమతుల్యం చేయడంలో, చుండ్రుని తొలగించడంతో ఇది సహాయపడుతుంది.


టీ ట్రీ ఆయిల్
 
టీ ట్రీ ఆయిల్‌లో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాలు.. చుండ్రుకు అద్భుతమైన నివారణగా పనిచేస్తాయి. రెగ్యులర్‌గా యూజ్ చేస్తున్న షాంపుకు కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్ యాడ్ చేసి వాడండి. లేదా క్యారియర్ ఆయిల్‌తో కరిగించి.. నేరుగా మీ తలకు అప్లై చేయండి. కొన్ని నిమిషాలు ఆరిపోయిన తరువాత తలను శుభ్రం చేసుకోండి. చుండ్రు క్రమంగా తగ్గిపోతుంది.


కొబ్బరి నూనె


ప్రస్తుతం హెయిర్ పొడిగా ఉండాలని చాలా మంది కొబ్బరి నూనెను ఉపయోగించడం లేదు. అయితే ఇది తలపై పొడిబారడం.. పొట్టును తగ్గించడంలో సహాయపడుతుంది. కొబ్బరి నూనెను వేడి చేసి మీ తలపై మసాజ్ చేయండి. కొన్ని గంటల గ్యాప్ తరువాత స్నానం చేయండి. మీ చుండ్రు తగ్గిపోవడంతోపాటు జుట్టు ఆరోగ్యంగా మారుతుంది. 


అలోవెరా


కలబందలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి స్కాల్ప్ ఇరిటేషన్, చుండ్రును తగ్గించడంలో సాయం చేస్తాయి. తాజా కలబంద జెల్‌ను నేరుగా మీ తలపై అప్లై చేసి.. 30 నిమిషాలు అలాగే ఉంచండి. ఆ తరువాత జుట్టును శుభ్రం చేసుకోండి. ఇది దురద, చుండ్రును తగ్గించడంలో సహాయపడుతుంది.


బేకింగ్ సోడా


బేకింగ్ సోడా ఒక ఎక్స్‌ఫోలియంట్. ఇది డెడ్ స్కిన్‌ను తొలగించి.. చుండ్రును తగ్గించడంలో సహాయపడుతుంది. ముందుగా జుట్టును నీటితో తడిపిన తరువాత.. మీ తలపై బేకింగ్ సోడాను రుద్దండి. కాసేపు ఆరిపోయిన తరువాత.. పూర్తిగా జుట్టును శుభ్రం చేసుకోండి. అయితే ఈ రెమెడీని ఎక్కువగా సార్లు ఉపయోగించకూడదు. తలపైన చర్మం పొడిబారిపోయే అవకాశం ఉంటుంది. 


(గమనిక: ఈ వార్త కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమే. మీరు ఎక్కడైనా మీ ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా చదివినా.. దానిని స్వీకరించే ముందు కచ్చితంగా వైద్యుల సలహాను తీసుకోండి.)


Also Read: Bjp-Janasena: తెలంగాణలో కుదిరిన పొత్తు, జనసేనకు 9 సీట్లు, ఓకే చెప్పిన పవన్ కళ్యాణ్


Also Read: Dust Allergy: డస్ట్‌ అలర్జీ బాధిస్తోందా..? అయితే ఈ ఐదు రకాల టిప్స్‌ను ట్రై చేయండి   



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook