Dates Benefits for Mens: పురుషులు తప్పకుండా ఖర్జూర పండ్లను తినాలి.. ఎందుకో తెలుసా..!
Dates Benefits for Mens: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది వైవాహిక జీవితాన్ని అనుభవించలేక పోతున్నారు. ముఖ్యంగా స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడం వంటి సమస్యలు అధికమవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
Dates Benefits for Mens: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది వైవాహిక జీవితాన్ని అనుభవించలేక పోతున్నారు. ముఖ్యంగా స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడం వంటి సమస్యలు అధికమవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే ఇటీవలే చాలా నివేదికలు భారత్‌లో ప్రతి నలుగురిలో ఇద్దరు ఇలాంటి సమస్యలకు గురవుతున్నాయని పేర్కొన్నాయి. ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి ఖర్జూర పండ్లను తినాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి పురుషుల స్పెర్మ్ కౌంట్‌ను పెంచడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ ఖర్జూరను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో తెలుసుకుందాం...
స్పెర్మ్ కౌంట్‌ను పెంచుతుంది:
పురుషులు తప్పనిసరిగా ఖర్జూరాన్ని తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే దీనిలో ఉన్న పోషకాలు జీర్ణవ్యవస్థ మెరుగుపరచడమే కాకుండా స్పెర్మ్ కౌంట్‌ను కూడా పెంచుతుంది. అయితే వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్లే మంచి లాభాలు చేకూరుతాయని నిపుణులు తెలుపుతున్నారు.
మనస్సు పదునుగా మారుతుంది:
ఖర్జూర మెదడుకు ఎంతో మేలు చేస్తుందని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు..! అయితే వీటిలో ఉండే గుణాలు మెదడును పదునుగా చేస్తుంది. పురుషులు తమ జీవనశైలిని మెరుగుపరుచుకోవడానికి కచ్చితంగా ఖర్జూర పండ్లను తినాలని నిపుణులు చెబుతున్నారు.
బ్లడ్‌లో షుగర్ కూడా అదుపులో ఉంటుంది:
మధుమేహం వ్యాధిగ్రస్తులలో చాలా మంది బ్లడ్‌లో షుగర్ పెరుగుతుందని వీటిని తినకుండా ఉంటారు. కానీ ఖర్జూర తినడం వల్ల షుగర్ ఉన్న వారికి ఎలాంటి హాని కలగదని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. ముఖ్యంగా రక్తంలో చక్కెరను నియంత్రించడాని సహాయపడుతుందని నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ప్రతి రోజూ వీటిని తింటే శరీరానికి మంచి లాభాలు కలుగుతాయని నిపుణులు భావిస్తున్నారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Read also: Weight loss By Walnuts: బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా వీటిని తినండి..!
Read also: Weight loss By Walnuts: బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా వీటిని తినండి..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook