Covid19 Vaccine: కరోనా వైరస్ సంక్రమణ విషయంలో కీలక విషయాలు వెలుగు చూశాయి. కోవిడ్ వైరస్ నియంత్రణలో వ్యాక్సినేషన్ ఎంతవరకూ పనిచేస్తుందనే విషయంపై ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. అసలు కోవిడ్ నియంత్రణలో వ్యాక్సిన్ ఏ మేరకు పనిచేస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా మహమ్మారి(Corona pandemic)నియంత్రణకై దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. అయితే కోవిడ్ వైరస్ సంక్రమణను నిరోధించడంలో వ్యాక్సిన్ ఎంత వరకూ పనిచేస్తుందనే విషయంపై కీలకమైన, ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. కరోనా వైరస్ జన్యుక్రమాన్ని విశ్లేషించే కన్సార్టియం..ఐఎన్ఎస్ఏసీఏజీ ఈ విషయాల్ని తెలిపింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో వ్యాక్సిన్లు సమర్ధవంతంగా పనిచేయడం లేదని అంచనా వేసింది.వ్యాక్సిన్ తీసుకున్న తరువాత కూడా డెల్టా వేరియంట్(Delta Variant)వెంటాడుతోందని వెల్లడించింది. అయితే వ్యాక్సిన్ తీసుకున్నవారిలో వ్యాధి తీవ్రత తక్కువగా ఉండి..మరణాలు దాదాపుగా లేవని తెలిపింది. దేశవ్యాప్తంగా 30 వేల 230 శాంపిల్స్‌ను పరీక్షించగా..అందులే 20 వేలకు పైగా కేసులు డెల్టా వేరియంట్ కేసులేనని ఐఎన్ఎస్ఏసీఏజీ స్పష్టం చేసింది.


దేశంలో కరోనా ఆర్ వాల్యూ 0.89 కు తగ్గినా..కేసులు మాత్రం రోజుకు 35-39 వేల మధ్య నమోదవడానికి కారణం డెల్టా వేరియంటేనని(Delta Variant)ఆ సంస్థ చెబుతోంది. ఇదే ఇప్పుడు ఆందోళనకు కారణమవుతోంది. దేశంలో గత 24 గంటల్లో 36 వేల 571 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ 50 కోట్ల26 లక్షల 99 వేల 702 మంది కరోనా నిర్ధారణ పరీక్షలు(Covid19 Tests) నిర్వహించారు. ఇప్పటి వరకూ దేశంలో 57 కోట్ల 22 లక్షలమందికి కోవిడ్ వ్యాక్సిన్ అందించారు. 


Also read: West Bengal Violence: పశ్చిమ బెంగాల్ హింసపై సీబీఐ విచారణ ప్రారంభం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook