Delta Variant of Covid-19: రోగ నిరోధకశక్తికి అందని డెల్టా వేరియంట్, అధ్యయనంలో షాకింగ్ విషయాలు
Delta Variant of Covid-19: కొత్తగా పుట్టుకొచ్చిన డెల్టా ప్లస్ కరోనా వేరియంట్ మరింత వేగంగా వ్యాప్తి చెందే స్వభావం కలిగి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు రోగనిరోధకశక్తిని సైతం దాటుకుని డెల్టా వేరియంట్ ముప్పు కలగజేస్తుందని తాజా అధ్యయనంలో తేలింది.
Delta Variant of Covid-19: భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 85 దేశాలలో డెల్టా కోవిడ్19 వేరియంట్ కేసులను గుర్తించారు. గత రెండు వారాల వ్యవధిలో 11 దేశాలలో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. భారత్‌లో సెకండ్ వేవ్‌కు కారణమైన వేరియంట్లలో ఒకటైన డెల్టా వేరియంట్ నుంచి డెల్టా ప్లస్ అనే వేరియంట్ పుట్టుకొచ్చింది. భారత్ వేరియంట్‌లుగా కప్పా, డెల్టా వేరియంట్‌లను పేర్కొంటారని తెలిసిందే.
కొత్తగా పుట్టుకొచ్చిన డెల్టా ప్లస్ కరోనా వేరియంట్ మరింత వేగంగా వ్యాప్తి చెందే స్వభావం కలిగి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్-19 బారిన పడి రోగనిరోధక శక్తి తగ్గిన వారిని త్వరగా ఇన్‌ఫెక్షన్‌కు గురిచేస్తుంది. మరోవైపు రోగనిరోధకశక్తిని సైతం దాటుకుని డెల్టా వేరియంట్ ముప్పు కలగజేస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. గతంలో తయారైన కోవిడ్19 వేరియంట్ల కన్నా COVID-19 Delta Variant మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని, తక్కువ సమయంలో ఎక్కువ మందికి వ్యాప్తి చెందుతుందని చెబుతున్నారు.
Also Read: COVID-19 New Wave: కరోనా కొత్త వేవ్ ఏర్పడేందుకు దారితీసే 4 పరిస్థితులు ఇవే
డెల్టా వేరియంట్ రోగనిరోధక శక్తిని ఛేదిస్తుంది..
డెల్టా వేరియంట్ యాంటీబాడీలపై ఏవిధంగా ప్రభావం చూపుతుంది, ఊపిరితిత్తులకు ఎంత మేర నష్టాన్ని కలుగజేస్తుందనేది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ పరిశోధకులు తెలిపారు. యూకేలో సైతం డెల్టా వేరియంట్ వ్యాప్తి చెందడంతో కరోనా కేసులు అధికమయ్యాయి. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం గుప్తా ల్యాబ్ నిపుణులు, ఐజీఐబీ డెల్టా వేరియంట్ గురించి కొన్ని విషయాలు గుర్తించారు. డెల్టా వేరియంట్ మనుషుల రోగనిరోధక శక్తిని తప్పించుకుని మరి ప్రభావం చూపుతుందని సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ రాజేష్ పాండే తెలిపారు. రెండు డోసుల వ్యాక్సిన్ (Covid-19 Vaccination) తీసుకున్న ఆరోగ్య కార్యకర్తలలో డెల్టా వేరియంట్ గుర్తించామని, అయితే రోగనిరోధకశక్తిని సైతం ఎలా తప్పించుకుని మనుషులలో ఇన్‌ఫెక్షన్ కలిగిస్తుందో అర్థం కావడం లేదన్నారు.
Also Read: COVID-19 Vaccine: కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే పిల్లలు పుట్టరా, కేంద్ర ఆరోగ్యశాఖ క్లారిటీ
వేగంగా వ్యాప్తి చెందుతుంది..
డెల్టా కోవిడ్19 వేరియంట్ ఇతరులకు వ్యాప్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉందని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అంట్ ఇంటరాక్టివ్ బయాలజీ డైరెక్టర్, డాక్టర్ అనురాగ్ అగర్వాల్ తెలిపారు. మీరు గతంలో తీసుకున్న వ్యాక్సిన్ల ప్రభావాన్ని చాలా మేరకు తగ్గించి ఇన్‌ఫెక్షన్ వ్యాప్తి చేస్తుంది. ముంబైలో నమోదైన కరోనా కేసులను పరిశీలిస్తే.. జనవరి నెలాఖరు వరకు ఇతర వేరియంట్లతో పోల్చితే కరోనా వ్యాప్తి చేసే అవకాశం 2 శాతం పెరిగిందన్నారు. కానీ రోగనిరోధక శక్తి నుంచి తప్పించుకుని మరీ (Delta Plus Variant) ఇన్‌ఫెక్షన్ కలిగించే అవకాశాలు 32 శాతం పెరిగినట్లు అధ్యయనంతో తేలింది. ఆల్ఫావేరియంట్‌తో పోల్చితే త్వరగా వ్యాప్తి చెందుతుందని గుర్తించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook