Fruits Good For Dengue Fever: వర్షాకాలం వచ్చిందంటే చాలు రోడ్లపై ఉండే గుంతల్లో మురికి నీరు అలాగే ఉండిపోతాయి. దీని కారణంగా దోమల ప్రభావం రెట్టింపు అవుతూ ఉంటుంది. దీంతో చాలామంది మలేరియా డెంగ్యూ వంటి వ్యాధుల బారిన పడుతూ ఉంటారు. నిజానికి వానాకాలంలో ఇంటి చుట్టు పరిసర ప్రాంతాలను తప్పకుండా శుభ్రంగా ఉంచుకోవాల్సి ఉంటుంది లేకపోతే దోమల తీవ్రత పెరిగి ఈ సమస్యలకు దారి తీయవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం చాలామందిలో వారికి తెలియకుండానే డెంగ్యూ ఫీవర్ వస్తూ ఉంటుంది. ఇది వచ్చిన కొన్ని నాళ్ళు సాధారణ జ్వరంగానే ఉన్నప్పటికీ తీవ్రత పెరిగిన కొద్దీ శరీరంలో మార్పులు వస్తూ ఉంటాయి. మరికొంతమందిలోనైతే రక్తంలోని ప్లేట్లెట్స్ తగ్గిపోయి అనేక రకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి డెంగ్యూ వచ్చిన వెంటనే గుర్తించి చికిత్స పొందడం చాలా మంచిది. ప్రస్తుతం చాలామంది డెంగ్యూ వచ్చిన వెంటనే ఇంట్లో తగిన చికిత్సలు పొందుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డెంగ్యూ సమయంలో శరీరం పై ప్రత్యేక శ్రద్ధ వహించడం ఎంత మంచిదో.. తీసుకునే ఆహారాలపై కూడా అంతే శ్రద్ధ వహించడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఫీవర్ తో బాధపడే వారు తప్పకుండా ఉదయం పూట పలు రకాల పండ్లను తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి డెంగ్యూ ప్రభావాన్ని తగ్గించి, శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచేందుకు కీలకపాత్ర పోషిస్తుంది. డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న వారు ఉదయం పూట తప్పకుండా ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


బొప్పాయి:
బొప్పాయిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, ఎంజైమ్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి, శరీరంలో వాపును తగ్గించడానికి సహాయపడతాయి. డెంగ్యూ జ్వరం వల్ల కలిగే రక్తహీనతకు చికిత్స చేయడానికి కూడా బొప్పాయి సహాయపడుతుంది. కాబట్టి డెంగ్యూతో బాధపడుతున్న ప్రతి ఒక్కరు ప్రతిరోజు బొప్పాయి పండును తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.


విటమిన్ సి అధికంగా ఉండే ఫ్రూట్స్: 
డెంగ్యూతో బాధపడుతున్న వారు విటమిన్ సి అధికమవుతాదిలో లభించే ఫ్రూట్స్ తినడం కూడా చాలా మంచిది. అంతేకాకుండా కొన్ని పండ్లలో మెగ్నీషియం కూడా లభిస్తుంది. కాబట్టి ఈ పండ్లు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి కండరాల నొప్పుల నుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా శరీరం కూడా ఎంతో స్ట్రాంగ్ గా మారుతుంది. 


నారింజ: 
నారింజలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి, శరీరంలో వాపును తగ్గించడానికి సహాయపడుతుంది. డెంగ్యూ జ్వరం కారణంగా శరీరంలో డ్యామేజ్ అయ్యే రక్తాన్ని తిరిగి మెరుగుపరిచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా శరీరాన్ని యాక్టివ్ గా ఉండేందుకు సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


కివి:
కివిలో విటమిన్ సి, విటమిన్ కె, పొటాషియం పుష్కలంగా ఉంటాయి.ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి, రక్తపోటును నియంత్రించడానికి కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా జ్వరం కారణంగా వచ్చే కండరాల నొప్పులను తగ్గించేందుకు కూడా ఎంతగానో సహాయపడతాయి ముఖ్యంగా తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ పండ్లను ప్రతిరోజు తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


ద్రాక్ష: 
ద్రాక్షలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.  ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి, శరీరంలో వాపును తగ్గించడానికి సహాయపడతాయి. డెంగ్యూ జ్వరం వల్ల కలిగే రక్తహీనతకు చికిత్స భాగంగా ఈ పండ్లను తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా రక్తాన్ని ఉత్పత్తి చేసేందుకు కూడా ఈ పనులు కీలక పాత్ర పోషిస్తాయి.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి