Weight Loss Foods: దేశీ ఆహారాలలో ఇలా 7 రోజుల్లో బరువు తగ్గొచ్చు..!
Desi Foods For Weight Loss: బిజీ లైఫ్ కారణంగా చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా బరువు కూడా పెరుగుతున్నారు. అయితే ఈ పెరుగుతున్న బరువును సులభంగా తగ్గించుకోవడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ చిట్కాలను వినియోగించండి.
Desi Foods For Weight Loss: బిజీ లైఫ్ కారణంగా చాలా మంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. కొందరైతే తీవ్ర వ్యాధులైనా గుండె పోటు, మధుమేహం వంటి సమస్యలతో బాధపడడం విశేషం. అయితే పై సమస్యలేకాకుండా చాలా మంది బరువు కూడా పెరుగుతున్నారు. దీని వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగి ప్రాణాంతకంగా మారుతుంది. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ఆహారాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
బరువు తగ్గించే దేశీ ఆహారాలు ఇవే:
1. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్:
కూరగాయలను ప్రతి రోజూ తీసుకోవడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు వీటిని తినడం వల్ల సులభంగా అనారోగ్య సమస్యలు తగ్గడమేకాకుండా బరువు తగ్గుతారు. శరీరానికి అవసరమైన విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో విటమిన్ బి12, విటమిన్ ఇ, ఐరన్, క్యాల్షియం లభిస్తాయి.
2. కొబ్బరినూనె:
మనం జుట్టు, చర్మ సంరక్షణ కోసం కొబ్బరినూనె వాడతారు. అయితే ఈ నూనెతో కూడా శరీర బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వంటనూనెలా వాడితే ఆకలిని నియంత్రించి బరువును తగ్గిస్తుంది.
3. టమోటా:
టమోటాలో కూడా శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. ఇందులో ఉండే ఫైబర్, వాటర్ కంటెంట్ బెల్లీ ఫ్యాట్ కరిగించడానికి సహాయపడుతుంది. కాబట్టి టమోటా నుంచి తీసిన రసాన్ని ప్రతి రోజూ తాగాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
4. పెరుగు:
పెరుగుతున్న బరువు త్వరగా తగ్గించడానికి పెరుగు కీలక పాత్ర పోషిస్తుంది. మధ్యాహ్న భోజనం తర్వాత పెరుగును తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా బ్యాక్టీరియా నుంచి జీర్ణక్రియను రక్షించడానికి సహాయపడుతుంది. కాబట్టి ఇది శరీర బరువు తగ్గించడానికి ప్రభావవంతంగా పని చేస్తుంది.
Also Read : Suresh Babu-Samantha : సమంత మహానటి.. నాగ చైతన్య పెద్ద మామ సురేష్ బాబు కామెంట్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి