Diabetes Control In 7 Days: ఆధునిక జీవనశైలికి అలవాటు పడడం వల్ల చాలామంది వివిధ రకాల అనారోగ్య సమస్యల గురవుతున్నారు. భారత్లో చాలామంది మధుమేహం, గుండె జబ్బులు వంటి సమస్యల భారీగా పడుతున్నారు. అయితే ఈ వ్యాధుల నుంచి విముక్తి పొందడానికి మార్కెట్లో చాలా రకాల ప్రొడక్ట్స్ ఉన్నప్పటికీ వాటిని వినియోగించడం వల్ల ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. నిపుణులు సూచించిన వివరాల ప్రకారం.. తప్పకుండా యోగా చేయడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అని వారు చెబుతున్నారు. అంతేకాకుండా తీసుకునే ఆహారంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించడం వల్ల.. రక్తంలోని చక్కెర పరిమాణం నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముఖ్యంగా తీవ్ర మధుమేహం సమస్యలతో బాధపడుతున్న వారు తప్పనిసరిగా ఉదయం పూట యోగా చేయాలని దాంతోపాటు వ్యాయామాలు కూడా చేయాలి. ఈ వ్యాయామాలు చేసే క్రమంలో ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా చేస్తే సకాలంలోనే మంచి ఫలితాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. డయాబెటిస్ కి చెక్ పెట్టే క్రమంలో తప్పకుండా పాటించే నియమాలపై శ్రద్ధ పెడితే అనుకున్న ఫలితాలు పొందవచ్చు. చాలామంది మదిలో వ్యాయామాలు చేస్తే డయాబెటిస్ ఎలా నియంత్రణ ఉంటుందని ప్రశ్న మెదలొచ్చు..!, వ్యాయామాలను రోజూ చేయడం వల్ల డయాబెటిస్ ఎలా నియంత్రణలో ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం..


ఈ వ్యాయామాలను పని సరిగా రోజు చేయాలి:


20 నిమిషాల పాటు నడవండి:
నడవడం అనేది కూడా ఓ సాధారణ వ్యాయామమే. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారికి ఈ వ్యాయామం తప్పనిసరి. రోజు 20 నిమిషాల నుంచి 30 నిమిషాల పాటు నడిస్తే.. మధుమేహం సులభంగా నియంత్రణలోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా టైప్-2 డయాబెటిస్ ఉన్న రోగులలో రక్తపోటుపై ప్రభావితం చేస్తుంది. కావున మధుమేహంతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ వ్యాయామాలు చేయాలి. వీటిని రోజూ చేయడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు అయినా గుండె జబ్బులు, పొట్టలో సమస్యలు, ఇతర సమస్యలకు చెప్పి పెట్టొచ్చు.


స్విమ్మింగ్:
బాడీకి స్విమ్మింగ్ కూడా ఓ వ్యాయామం గానే చెప్పొచ్చు. చాలామంది వైద్య నిపుణులు ఈ స్విమ్మింగ్ ని కార్డుయో వ్యాయామం అని కూడా అంటారు. ఇది శరీరంలో కొలెస్ట్రాలను నియంత్రించడమే కాకుండా బాడీని ఫిట్ గా చేస్తుంది. రోజు స్విమ్మింగ్ చేయడం వల్ల రక్తంలోని ఇన్సులిన్ స్థాయిలను ప్రభావితం చేసి డయాబెటిస్ ని నియంత్రించే అవకాశాలు కూడా అధికమని నిపుణులు తెలుపుతున్నారు. సాధారణంగా బరువు తగ్గాలనుకునేవారు ఈ వ్యాయామం తప్పనిసరిగా చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.


యోగా:
యోగలో అన్ని శరీర సమస్యలకు చెక్ పెట్టే.. గుణాలున్నాయి. టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడేవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కావున మధుమేహంతో బాధపడేవారు తప్పకుండా ఉదయం పూట యోగాసనాలు చేయాలి. ఇలా చేయడం వల్ల సకాలంలోనే మధుమేహానికి చెక్ పెట్టొచ్చు.. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి మంచి చిట్కా కూడా... బరువు తగ్గాలనుకునే వారు ప్రతిరోజు 20 నుంచి 30 నిమిషాల పాటు యోగా చేయడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండి.. బరువు కూడా సులభంగా తగ్గుతారు.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read:  Weight Loss Tips: ఆ నాలుగు అలవాట్లు మార్చుకుంటే..నెలలోనే బరువు తగ్గడం ఖాయం


Also Read:  Weight Loss Tips: ఈ ఆహార నియమాలు పాటిస్తే ఖచ్చితంగా మీరు 12 రోజుల్లో బరువు తగ్గుతారు..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook