Type 2 Diabetes Control In 7 Days: మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది మధుమేహం సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించపోవడం వల్లే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మధుమేహం సమస్య నుంచి ఉపశమనం పొందడానికి కచ్చితం తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించి.. ప్రోటిన్లు గల ఆహారాలను తీసుకోవాలి. లేకపోతే శరీరంలోని రక్తంలో చక్కెర పరిమాణం పెరిగిపోయి తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీసే అవకాశాలున్నాయి. కావున మధుమేహం నుంచి ఉపశమనం పొందడానికి పలు రకాల నియమాలు పాటించాల్సి ఉంటుంది. అందులో ముఖ్యమైనది జీవనశైలిలో మార్పులు. కావును ఈ మార్పుల వల్ల మధుమేహం నియంత్రంణలో ఉండే అవకాశాలున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ  పండ్లను తప్పనిసరిగా తినాలి:


1. బేరి:
బేరి పండులో గ్లైసెమిక్ ఇండెక్స్ పరిమాణాలు తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది రక్తంలో చక్కెర స్థాయిలని నియంత్రిస్తాయి. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ బి1, విటమిన్ బి2, విటమిన్ బి3, విటమిన్ బి9లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా బేరిలో పొటాషియం, కాల్షియం, జింక్ పుష్కలంగా ఉంటుంది. కావున శరీరాని చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతుంది.


2. జామ:
జామ పండులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండటమే కాకుండా.. సోడియం తక్కువగా ఉంటుంది. కావున మధుమేహ వ్యాధిగ్రస్తులపై ప్రభావవంతంగా పని చేస్తుంది. జామపండులో నారింజ కంటే నాలుగు రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. కావున రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది.


3. నారింజ:
సిట్రస్ పండ్లు మధుమేహాన్ని తగ్గించేందుకు ప్రభావవంతంగా పని చేస్తాయి. ఇందులో ఉండే సిట్రస్ గుణాలు డయాబెటిస్‌ను కంట్రోల్‌ చేయడమే కాకుండా.. శరీరాన్ని దృఢంగా చేస్తుంది.


4. గ్రీన్ యాపిల్:
డయాబెటిక్ రోగులకు గ్రీన్ యాపిల్ సూపర్ ఫుడ్‌ అని వైద్యులు చెబుతారు. ఈ పండులో కరిగే ఫైబర్, నియాసిన్, జింక్, ఐరన్ ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెరను నియంత్రించడానికి సహాయపడతాయి.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


 


Also Read: PM Modi and Pak Sister: ప్రధాని మోదీకు 25 ఏళ్లుగా రాఖీ కడుతున్న పాకిస్తాన్ చెల్లెలు.


Also Read: క్యాబ్ డ్రైవర్‌పై 20 మంది దాడి.. కోమాలో బాధితుడు.. డబ్బులు ఇవ్వకపోగా స్నేహితులతో కలిసి దాడి చేసిన నిందితుడు 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook