Diabetes Control With Brown Rice:  బియ్యం అనేది భారత్‌లో అత్యంత సాధారణంగా వినియోగించే తృణధాన్యాల్లో ఒకటి. దక్షిణ భారత దేశంలో చాలా ఆహారంలో భాగంగా బియ్యాన్ని వినియోగిస్తుంటారు. అయితే ఇదే క్రమంలో ఎక్కువగా డయాబెటిస్‌తో బాధపడుతున్నవారు వీటిని ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వైట్ రైస్‌లో అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. కాబట్టి వీటిని మధుమేహం సమస్యలతో బాధపడేవారు అతిగా తీసుకుంటే రక్తంలో చక్కెర పరిమాణాలు ఎక్కువగా పెరిగి ప్రాణాంతకంగా మారే అవకాశాలున్నాయి. కాబట్టి ఆహారంగా ఈ వైట్‌ రైస్‌ను తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ తెల్ల బియ్యానికి బదులుగా ఎలాంటి బియ్యాన్ని తీసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఎందుకు వైట్‌రైస్‌ మంచిది కాదు:
సహజసిద్ధంగా పండించిన బియ్యం ఆరోగ్యానికి అంత ప్రమాదకరం కాదు. కానీ ప్రస్తుతం బియ్యాన్ని తీసి మిల్లుకు తీసుకెళ్లి పాలిష్ చేసి తెల్లగా మెరిసిపోయేలా చేస్తున్నారు. అయితే దీని వల్ల పోషక విలువలు తగ్గిపోయి. దీని కారణంగా గ్లైసెమిక్ సూచిక కూడా పెరుగుతుంది. దీంతో గ్లూకోజ్ స్థాయిలు కూడా పెరుగుతాయి. ఈ రోజుల్లో కల్తీ బియ్యం కూడా మార్కెట్‌లో విపరీతంగా విక్రయిస్తున్నాయి. ఇది ఆరోగ్యానికి మరింత ప్రమాదకరం కావొచ్చు.


మధుమేహ వ్యాధిగ్రస్తులు ఏ బియ్యం తినాలి.?:
టైప్-2 డయాబెటిస్‌తో బాధపడుతున్నవారు వైట్ రైస్ అస్సలు తినకూడదు. కానీ వారు బ్రౌన్ రైస్ తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.  బ్రౌన్ రైస్ వల్ల శరీరానికి ప్రయోజనాలు లభించడమేకాకుండా.. మధుమేహానికి చెక్‌ పెట్టొచ్చు. ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు, ఎక్కువ ఫైబర్, ఎక్కువ విటమిన్లు, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ స్కోర్ ఉంటాయి. కాబట్టి మధుమేహంతో బాధపడుతున్నవారు తప్పకుండా వీటిని తీసుకోవచ్చు.


ఏ బియ్యంలో తక్కువ GI స్కోర్‌ని కలిగి ఉంటుంది.?:
వైట్ రైస్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ స్కోర్ 70కి దగ్గరగా ఉంది. అంటే టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు వీటిని తీసుకోవడం వల్ల ప్రమాదకరంగా మారొచ్చు.. మరోవైపు బ్రౌన్ రైస్ గురించి మాట్లాడినట్లయితే.. దానిలో GI స్కోర్‌ 50కి దగ్గరగా ఉంటుంది. కాబట్టి చాలా మంది ఆరోగ్య నిపుణులు దీనిని తినాలని సూచిస్తారు.


(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..


Also Read:Weight Loss: బరువు తగ్గే క్రమంలో ఈ నియమాలు పాటించండి.. కేవలం 11 రోజుల్లో బరువు తగ్గడం ఖాయం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebok