డయాబెటిస్ చాలా ప్రమాదకరమైంది. నిర్లక్ష్యంగా ఎంత ప్రమాదకరమో..జాగ్రత్తగా ఉంటే అంతే త్వరగా నియంత్రించవచ్చు. అయితే మధుమేహం విషయంలో కొన్ని లక్షణాలు అంతర్గతంగా ఉంటాయి. ఇవే చాలా ప్రమాదకరం. ఆ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మారుతున్న జీవనశైలి, మారుతున్న వాతావరణం కారణంగా రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంటుంది. ఇమ్యూనిటీ తగ్గడం వల్ల తక్కువ వయస్సుకే పలు వ్యాధులకు బలవుతుంటారు. డయాబెటిస్ వంటి ప్రమాదకర వ్యాధి ఇటీవలి కాలంలో వేగంగా వ్యాపిస్తోంది. ఈ వ్యాధికి నియంత్రణ సాధ్యమే కానీ..చికిత్స మాత్రం లేదు. మరోవైపు డయాబెటిస్ ఇటీవలి కాలంలో చిన్న వయస్సుకే సోకుతుండటం మరింత ఆందోళన కల్గిస్తోంది. డయాబెటిస్‌లో కొన్ని లక్షణాలు అంతర్గతంగా దాగుంటాయి. ఇవే చాలా డేంజర్. వీటిని ఎన్నటికీ నిర్లక్ష్యం చేయకూడదు. రహస్యంగా, అంతర్గతంగా ఉండే ఆ లక్షణాలేంటో చూద్దాం..


డయాబెటిస్‌లో సైలెంట్ లక్షణాలు


మెడ నల్లగా, లావుగా మారడం


ఈ లక్షణం ఉన్నప్పుడు చాలామంది నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంటారు. మీ మెడ రంగు..మిగిలిన చర్మం రంగుతో పోలిస్తే నల్లగా ఉండటం, లావుగా మారడం జరిగితే అప్రమత్తం కావాలి.  ఎందుకంటే ఇది డయాబెటిస్ లక్షణం కావచ్చు. ఒకవేళ మీ మెడ రంగు నల్లగా ఉన్నా లేదా మెడ లావుగా మారినా నిర్లక్ష్యం చేయవద్దు.


తరచూ ఇన్‌ఫెక్షన్ సోకడం


డయాబెటిస్ రోగులకు తరచూ ఇన్ ఫెక్షన్ సోకుతుంటుంది. ఒక్కోసారి కడుపు పాడవుతుంటుంది. ఒక్కోసారి చేతులు, కాళ్లలో దురద వస్తుంటుంది. ఒకవేళ మీకు తరచూ ఇన్‌ఫెక్షన్ సోకుతుంటే..పొరపాటున కూడా నిర్లక్ష్యం చేయవద్దు. ఎందుకంటే డయాబెటిస్‌లో ఇదే సైలెంట్ లక్షణం కావచ్చు. ఇక చర్మంపై మొటిమలు కూడా రావచ్చు.


కంటి చూపు తగ్గడం


శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు కంటి చూపు కూడా పెరుగుతుంది. ఈ సమస్య ఉన్నప్పుడు కంటి పరీక్షతో పాటు బ్లడ్ షుగర్ టెస్ట్ కూడా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది డయాబెటిస్‌లో సైలెంట్ లక్షణం కావచ్చు.


Also read: Cholesterol Symptoms: శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైందా..ఈ లక్షణాలతో తెలుసుకోవచ్చు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook