మధుమేహం ఓ తీవ్రమైన వ్యాధి. శరీరంలోని వివిధ అంగాలకు హాని కలిగిస్తుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువైతే కళ్లపై దుష్ప్రభావం పడుతుంది. ఫలితంగా డయాబెటిస్ రెటినోపతి సమస్య ఉత్పన్నమౌతుంది. ఫలితంగా కంటి వెలుగు కోల్పోయే ప్రమాదముంది. మధుమేహం ఉన్నప్పుడు కళ్లలో సమస్య కన్పిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. డయాబెటిస్ ఉన్నప్పుడు కళ్లపై ప్రత్యేక శ్రద్ధ అవసరం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కళ్లు బలహీనమైతే కన్పించే లక్షణాలు


డయాబెటిస్ సమస్య ఉంటే..కళ్లు మసకగా కన్పిస్తాయి. డబుల్ విజన్ సమస్య, కళ్లలో నొప్పి, కళ్లు ఎర్రగా ఉండటం, స్ట్రైట్ లైన్ సమస్య ఉంటే కళ్లకు ఓ హెచ్చరిక లాంటిది. ఈ లక్షణాలు కన్పిస్తే..వెంటనే అప్రమత్తం కావాలి. 


డయాబెటిస్ నియంత్రణ


మీకు డయాబెటిస్ సమస్య వెంటాడుతుంటే..ముందుగా బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రిస్తే కళ్ల డ్యామేజ్ నుంచి కాపాడుకోవచ్చు. హై కేలరీలు, కార్బోహైడ్రేట్లు లేదా స్వీట్స్‌కు దూరంగా ఉండాలి. డయాబెటిస్ నియంత్రించేందుకు ముందుగా జీవనశైలిలో మార్పు అవసరం. 


స్మోకింగ్‌కు దూరం


డయాబెటిస్ ఉన్నప్పుడు స్మోకింగ్ చేయడం చాలా ప్రమాదకరం. స్మోకింగ్ కారణంగా కంటి రక్త వాహికలు డ్యామేజ్ అయ్యే ప్రమాదముంది. కంటి వెలుగు తగ్గవచ్చు. అందుకే స్మోకింగ్‌కు దూరంగా ఉండాలి.


బ్లడ్ ప్రెషర్ నియంత్రణ


మధుమేహం సమస్య ఉంటే బ్లడ్ ప్రెషర్‌పై ప్రత్యేక శ్రద్ధ అవసరం. హై బ్లడ్ ప్రెషర్ కారణంగా ఇబ్బందులు పెరుగుతాయి. అందుకే ఉప్పు, నూనె తగ్గించాల్సి ఉంటుంది. 


Also read: BF.7 Variant Scare: వణికిస్తున్న బిఎఫ్.7 వేరియంట్ ఎంట్రీ.. మీ ఇంట్లో ఇవి ఉన్నాయా ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook