BF.7 Variant Scare: వణికిస్తున్న బిఎఫ్.7 వేరియంట్ ఎంట్రీ.. మీ ఇంట్లో ఇవి ఉన్నాయా ?

BF.7 Variant Scare: చైనాను వణికిస్తున్న కరోనావైరస్ ఫోర్త్ వేవ్‌ని చూసి యావత్ ప్రపంచం అప్రమత్తమవుతోంది. రెండేళ్ల కిందట నేర్చుకున్న గుణపాఠాలతో జనం కూడా ముందు జాగ్రత్త చర్యగా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య పరిస్థితిలో మార్పులను గుర్తించే కొన్ని ముఖ్యమైన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌కి మళ్లీ డిమాండ్ కనిపిస్తోంది.

Written by - Pavan | Last Updated : Dec 26, 2022, 05:16 PM IST
  • గతం నేర్పిన గుణపాఠాలతో అప్రమత్తమైన జనం
  • ముందు జాగ్రత్త చర్యగా అవసరమైన గ్యాడ్జెట్స్ సమకూర్చుకోవడంలో బిజీ
  • మార్కెట్లో, ఆన్‌లైన్‌లో హెల్త్ గ్యాడ్జెట్స్‌కి పెరిగిన డిమాండ్
BF.7 Variant Scare: వణికిస్తున్న బిఎఫ్.7 వేరియంట్ ఎంట్రీ.. మీ ఇంట్లో ఇవి ఉన్నాయా ?

BF.7 Variant Scare: ఒమిక్రాన్ బిఎఫ్.7 వేరియంట్ ఎంట్రీ దడ పుట్టిస్తోంది. కరోనావైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరగనున్నాయా ? దేశంలో మరోసారి లాక్ డౌన్ విధిస్తారా ? 2020 నాటి పరిస్థితులు మళ్లీ చూడనున్నామా ? ఇప్పుడు చాలామందిని ఆందోళనకు గురిచేస్తోన్న ప్రశ్నలివి. చాలామంది మెదళ్లను తొలిచేస్తోన్న సందేహాలు కూడా ఇవే. ఈ నేపథ్యంలో మీ ఆరోగ్య పరిస్థితిలో ఏదైనా మార్పులు చోటుచేసుకుంటే గుర్తించడం ఎలానో తెలుసుకోండి. ఎప్పటికప్పుడు మీ ఆరోగ్య పరిస్థితిని ట్రాక్ చేసే కొన్ని ముఖ్యమైన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌ని రెడీగా ఉంచుకోండి. అలాగే ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తితే మీ ఇంట్లో ఉండే ఆ అనారోగ్య సమస్యను నయం చేసుకునే పరికరాలను కూడా ముందే సమకూర్చుకోండి. అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.

పల్స్ ఆక్సీమీటర్ : 
రక్తంలో ఆక్సీజన్ లెవెల్స్ పడిపోవడం అనేది కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్ సోకినప్పుడు కనిపించే లక్షణాల్లో ఒకటి. అలాంటప్పుడు మీ ఒంట్లో SpO2 లెవెల్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే పల్స్ ఆక్సీమీటర్ మీ వెంట ఉండాల్సిందే. పల్స్ ఆక్సీమీటర్ ఆన్‌లైన్లో కానీ లేదా బయట స్టోర్స్‌లో కానీ రూ. 500 నుంచి రూ.2500 వరకు పలుకుతుంది. 

డిజిటల్ బ్లడ్ ప్రెషర్ మానిటర్ :
సాధారణ బ్లడ్ ప్రెషర్ 80-120 mm Hg మధ్యలో ఉంటుంది. కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్ సోకితే, బ్లడ్ ప్రెషర్ కూడా ప్రభావితం అవుతుంది కనుక ఇంట్లో డిజిటల్ బ్లడ్ ప్రెషర్ మానిటర్ ఉండటం ఎంతైనా ఉత్తమం. డిజిటల్ బ్లడ్ ప్రెషర్ మానిటర్ రూ. 2 వేల నుంచి 3 వేల వరకు ఉంటుంది. డిజిటల్ బ్లడ్ ప్రెషర్ మానిటర్ కొనేటప్పుడు పల్స్ రేట్ కూడా చూపించే డిజిటల్ బ్లడ్ ప్రెషర్ మానిటర్‌ని ఎంచుకోండి. అలాంటప్పుడు పల్స్ చెక్ చేసుకోవడానికి మరొక పరికరం విడిగా మెయింటెన్ చేయాల్సిన పని లేదు.

డిజిటల్ ఐఆర్ థర్మామీటర్ :
కరోనావైరస్ విషయంలో ఒకరు ఉపయోగించిన థర్మామీటర్‌ని మరొకరు ఉపయోగించే పరిస్థితి ఉండదు కనుక మార్కెట్లో అందుబాటులో ఉన్న డిజిటల్ ఐఆర్ థర్మామీటర్‌ని కొనుగోలు చేయడం బెటర్. కరోనావైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకకుండా నివారించేందుకుగాను శరీరాన్ని తాకకుండానే 1 - 2 ఇంచుల దూరం నుంచే బాడీ టెంపరేచర్ ని చెక్ చేయడానికి ఈ డిజిటల్ ఐఆర్ థర్మామీటర్ ఉపయోగపడుతుంది. ఆన్‌లైన్‌లో కానీ లేదా స్టోర్స్‌లో కానీ రూ. 900 నుంచి ఈ డిజిటల్ ఐఆర్ థర్మామీటర్ లభిస్తుంది.

బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్‌ని మానిటర్ చేసే గ్లూకోమీటర్ :
గ్లూకోమీటర్ తో అందరికి పని పడకపోవచ్చు కానీ డయాబెటిస్ పేషెంట్స్ కి మాత్రం రక్తంలో షుగర్ లెవెల్స్ చెక్ చేయడానికి దీని అవసరం తప్పనిసరి. ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో రూ. 500 నుంచే ఈ పరికరం లభిస్తుంది.

ఆక్సీజెన్ కాన్సంట్రేటర్ : 
శ్వాసకోశ సంబంధిత సమస్యలు, ఊపిరితిత్తులు, గుండె పని తీరు నెమ్మదిగా, బలహీనంగా ఉండే వారికి ఆక్సీజెన్ కాన్సంట్రేటర్ ఉపయోగపడుతుంది. మనం పీల్చే గాలిలో నైట్రోజెన్‌తో పాటు కాలుష్యకారకాలను నివారించి ఆక్సీజెన్‌ని సరఫరా చేసే ఆక్సీజెన్ కాన్సంట్రేటర్‌ని కొనుగోలు చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. వారంటీ, ఆథెంటిసిటీ, సర్వీస్ నెట్‌వర్క్ ఎలా ఉన్నాయో పరిశీలించుకోవాలి. ఆక్సీజెన్ కాన్సంట్రేటర్స్ కూడా ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో లభ్యం అవుతాయి.  

పోర్టబుల్ ఆక్సీజెన్ కానిస్టర్ :
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైనప్పుడు అత్యవసర వైద్య సహాయం లభించే వరకు పోర్టబుల్ ఆక్సీజెన్ కానిస్టర్ సహాయపడుతుంది. కానీ ఇది తాత్కాలిక పరిష్కారం మాత్రమే అనే విషయం మర్చిపోవద్దు.

నెబులైజర్ మెషిన్ :
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైనప్పుడు ఆక్సీజెన్‌ని నేరుగా ఊపిరితిత్తులకు పంపింగ్ చేయడానికి నెబులైజర్ మెషిన్ ఉపయోగపడుతుంది. ఆన్‌లైన్‌లో అయినా లేదా మార్కెట్‌లో అయినా 1500 రూపాయల నుంచి ఈ నెబులైజర్ లభిస్తుంది.

స్టీమర్ :
తీవ్రమైన జలుబు, దగ్గుతో బాధపడేటప్పుడు గొంతులో మంటని నివారించేందుకు స్టీమర్ హెల్ప్ అవుతుంది. ఇది కేవలం 400 రూపాయల నుంచే మార్కెట్లో అందుబాటులో ఉంది. 

ఇది కూడా చదవండి : BF.7 Variant Symptoms: ఒమిక్రాన్ బిఎఫ్.7 వేరియంట్ ఎందుకంత వణికిస్తోంది ? లక్షణాలు ఏంటి ?

ఇది కూడా చదవండి : BF.7 Variant In India: బిఎఫ్7 వేరియంట్ ఇండియాను ఏమీ చేయలేదట.. ఎందుకంటే..

ఇది కూడా చదవండి : Covid 4th Wave in India: కొవిడ్ ఫోర్త్ వేవ్ రానుందా ? కేంద్రం ఏం చెబుతోంది ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News