Banana Flower Benefits: అరటి పువ్వుతో 10 రోజుల్లో బరువు తగ్గొచ్చు.. ఎలాగంటే..?
Banana Flower for Diabetes and Weight Loss: అరటి పువ్వు క్రమం తప్పకుండా ఆహారాల్లో తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు తీవ్ర మధుమేహాన్ని కూడా నియంత్రిస్తాయి. శరీర బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు ఈ పువ్వుతో తయారు చేసిన డికాషన్ తాగడం వల్ల గొప్ప ఉపశమనం లభిస్తుంది.
Banana Flower for Diabetes and Weight Loss in 10 Days: భారతీయులు అరటిని ఇష్టపడి తింటూ ఉంటారు. ప్రతి రోజు ఆహారంలో అరటిని తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అరటి కాయలే కాకుండా ఈ చెట్టు నుంచి వచ్చే పువ్వును కూడా ఆహారాల్లో వినియోగించుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ముఖ్యంగా మధుమేహం, ఊబకాయం, ఒత్తిడి సమస్యలతో బాధపడేవారికి ఈ పువ్వు ప్రభావంతంగా సహాయపడుతుంది. అరటి పువ్వులో ఉండే ఫైబర్, ప్రొటీన్, పొటాషియం, కాల్షియం, కాపర్, ఫాస్పరస్, ఐరన్, మెగ్నీషియంతో పాటు విటమిన్ ఇ పోషకాలు లభిస్తాయి. కాబట్టి ఈ పువ్వును క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరానికి చాలా లాభాలు కలుగుతాయి. ఈ పువ్వును ప్రతి రోజు ఆహారంలో తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది:
మధుమేహాన్ని నియంత్రిస్తుంది:
అరటి పువ్వును ఉడకబెట్టి ప్రతి రోజు కషాయంలా తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. మబుఖ్యంగా రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
రక్తహీనత:
ప్రస్తుతం చిన్న పిల్లలో ఈ రక్త హీనత సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు ఐరన్ లోపమేనని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా అరటి ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు రక్తహీనత సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి.
Also Read : Pawan Kalyan Comments: నన్ను వదిలేస్తే ముస్లింలకే నష్టం, కాకినాడలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
ఒత్తిడి:
అరటి పువ్వులో ఉండే మెగ్నీషియం, యాంటీ-ఆక్సిడెంట్, యాంటీ డిప్రెసెంట్ మూలకాలు మానసిక ఒత్తిడి నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా శరీరం కూడా చురుకుగా మారుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
బరువు తగ్గడం:
అరటి పువ్వుతో తయారు చేసిన డికాషన్ ప్రతి రోజు తాగడం వల్ల ఆకలిని నియంత్రిస్తుంది. ఇందులో ఉండే పీచు పదార్థాలు సులభంగా బెల్లీ ఫ్యాట్‌ను నియంత్రిస్తుంది. అంతేకాకుండా శరీంలో పెరుగుతున్న కొలెస్ట్రాల్‌ను కూడా సులభంగా నియంత్రిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
అధిక రక్తపోటు:
ఒత్తిడి కారణంగా చాలా మందిలో అధిక రక్తపోటు సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా అరటి పువ్వుతో తయారు చేసిన ఆహారాలు ప్రతి రోజు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ హైపర్‌టెన్సివ్ ఏజెంట్స్ రక్తపోటును నియంత్రిస్తుంది.
Also Read : Pawan Kalyan Comments: నన్ను వదిలేస్తే ముస్లింలకే నష్టం, కాకినాడలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook