Watermelon in Fridge: ఎండకాలం మొదలైంది. మార్కెట్లో సేదతీరడానికి వివిధ రకాల పండ్లు, చెరుకురసం, లెమన్ జ్యూస్‌తోపాటు వివిధ రకాల రసాలు అందుబాటులో ఉన్నాయి. అయితే, రంజాన్ సీజన్‌తోపాటు వేసవికాలం ఎక్కువగా మర్కెట్లో పుచ్చకాయ పండ్లు కూడా అందుబాటులో ఉంటాయి. కట్ చేసి కూడా రోడ్లపై వీటిని స్టాళ్లలో విక్రయిస్తారు. దాహం తీరడానికి, శరీరం డీహైడ్రేట్ కాకూడదని మనం కూడా మార్కెట్ నుంచి పుచ్చకాయలను కొనుగోలు చేసి తీసుకువస్తాం. అయితే,పుచ్చకాయను తెచ్చిన వెంటనే తినేయాలి. దాన్ని ఫ్రిజ్‌లో నిల్వ చేయకూడదు. దీనివల్ అనారోగ్య సమస్యలు వస్తాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎండకాలం భానుడి భగభగలతో మనం బయటకు వెళ్లినప్పుడు దాహార్తిని తీర్చే పండ్లు, జ్యూసులను ఆశ్రయిస్తాం. అంతేకాదు పుచ్చకాయలో దాదాపు 90 శాతం వరకు నీరు ఉంటుంది. ఇది మనల్ని డీహైడ్రేషన్‌కు లోనవ్వకుండా చేస్తుంది. ఎండకాలం వడదెబ్బ తగలకుండా మనల్ని కాపాడుతుంది. అందుకే ఎండకాలం పుచ్చకాయను తప్పనిసరిగా మన డైట్లో చేర్చుకోవాలి. దీంతో బరువు కూడా సులభంగా తగ్గొచ్చు. ఇది సిట్రూలైన్ నైట్రిక్ యాసిడ్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ యాసిడ్ బ్లడ్ ప్రెజర్ పెరగకుండా కాపాడతాయి. పుచ్చకాయలో మాత్రమే కాదు వీటి గింజల్లో కూడా ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి.


ఇదీ చదవండి:బ్లాక్‌బెర్రీలో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు ఇవే.. దీంతో అనారోగ్య సమస్యలకు చెక్‌!


అంతేకాదు పుచ్చకాయలో విటమిన్ ఏ, సీ తోపాటు అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో ముఖ్యంగా లైకోపీన్ ఉంటుంది.అంతేకాదు కేలరీలు కూడా పుచ్చకాయలో తక్కువ మొత్తంలో ఉంటాయి. దీంతో ఎక్కువసేపు మనకు ఆకలి అవ్వదు. దీంతో బరువు పెరుగుతామనే టెన్షన్ ఉండదు. పుచ్చకాయను పండుగా తింటారు. మరికొందరు జ్యూస్‌ తయారు చేసుకుని తాగుతారు. ముఖ్యంగా పుచ్చకాయను డైట్లో చేర్చుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటుంది. పుచ్చకాయలో ఉండే కుక్కుర్బిటాసిన్ ఇ కేన్సర్‌కు వ్యతిరేకంగా పనిచేస్తాయి. ఇందులో ఉండే లైకోపిన్ ప్రోస్టేట్ కేన్సర్, కలరెక్టల్ కేన్సర్ రాకుండా నివారిస్తుంది. అంతేకాదు లైకోపిన్ బ్లడ్ ప్రెజర్, కొలెస్ట్రాల్, గుండె సంబంధిత వ్యాధులను రాకుండా కూడా కాపాడుతుంది.


ఇదీ చదవండి:శరీరంలో చెడుకొలెస్ట్రాల్ తగ్గించి.. మంచి కొలెస్ట్రాల్ పెంచే ఆహారాలు..


అయితే, మార్కెట్‌ నుంచి కొనుగోలు చేసి తెచ్చిన పుచ్చకాయను కొంతమంది కట్ చేసిన తర్వాత సగ భాగాన్ని ఫ్రిజ్ లో నిల్వ చేస్తారు. దీంతో అందులో బాక్టిరియా పెరుగుతుంది. ఇది మన శరీరానికి హానికరం. కడుపు సంబంధిత సమస్యలు పెరుగుతాయి. పుచ్చాకయను కేవలం రూం టెంపరేచర్‌లో స్టోర్ చేసిందే తినాలని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఈసారి మీరు మార్కెట్‌ నుంచి తెచ్చిన పుచ్చకాయను పూర్తిగా తినేయండి. సగం కట్‌ చేసి ఫ్రిజ్‌లో నిల్వ చేయకండి. ఇది ఆరోగ్యానికి హానికరం అని గుర్తుంచుకోండి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి