Strawberry Juice Benefits: స్ట్రాబెర్రీలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను మెరుగుపరుస్తుంది. ఇంకా అనేక విటమిన్లు, మినరల్స్‌ స్ట్రాబెర్రీల్లో పుష్కలంగా ఉన్నాయి.కంటి చూపు బలంగా ఉండాలంటే స్ట్రాబెర్రీ జ్యూస్ తాగాలి. అవేంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బలమైన ఎముకలు..
స్ట్రాబెర్రీలో కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. దీంతో ఎముకలు బలంగా మారతాయి. స్ట్రాబెర్రీలు బోలు ఎముకల వ్యాధిని నివారిస్తాయి. వీటిని డైట్లో చేర్చుకుంటే ఎముకలు ఆరోగ్యంగా, బలంగా తయారవుతాయి.


వెయిట్ లాస్..
స్ట్రాబెర్రీల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇవి తినడం వల్ల ఎక్కువ సమయం ఆకలివేయదు. దీంతో బరువు సులభంగా తగ్గిపోతారు. అంతేకాదు స్ట్రాబెర్రీల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి కూడా. దీంతో ఇవి తిన్నా బరువు పెరగరు. స్ట్రాబెర్రీలు వెయిట్ లాస్ జర్నీలో కీలకపాత్ర పోషిస్తాయి.


గుండె సమస్యలు..
స్ట్రాబెర్రీల్లో అధిక ఫ్లెవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనల్స్ ఉండటం వల్ల అలెర్జీలను నివారిస్తాయి. దీంతో రక్త సరఫరా మెరుగవుతుంది. ఇవి ఇన్సులిన్ స్థాయిలు పెరగకుండా షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి.  అంతేకాదు గుండెకు కూడా రక్తసరఫరా సాఫీగా సాగుతుంది. ముఖ్యంగా స్ట్రాబెర్రీలు కొలెస్ట్రాల్ స్థాయిని నిర్వహించడానికి ఉపయోగపడతాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. 


ఇదీ చదవండి:  క్రాన్బెర్రీ జ్యూస్ స్త్రీలకు అమృతం.. అనేక వ్యాధులకు దూరంగా ఉంటూ ఈ 5 ప్రయోజనాలు పొందొచ్చు..


ఆస్తమా..
స్ట్రాబెర్రీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కారణంగా ఆస్తమా తాలుకా అలర్జీల ప్రభావాన్ని వెంటనే తగ్గిస్తుంది. ముఖ్యంగా స్ట్రాబెర్రీలు అలెర్జీల సమస్య తగ్గుముఖం పడుతుంది. అందుకే తప్పకుండా మీ డైట్లో స్ట్రాబెర్రీలను చేర్చుకోండి. స్ట్రాబెర్రీ జ్యూస్ క్యాన్సర్‌ను సైతం నివారిస్తుంది. 


మెదడు ఆరోగ్యం..
స్ట్రాబెర్రీల జ్యూస్ తాగడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి మెదడు కణాలకు ఏ హానీ కలగకుండా సహాయపడుతుంది. అంతేకాదు స్ట్రాబెర్రీ జ్యూస్ తాగడం వల్ల ఏకాగ్రత కూడా పెరుగుతుంది.


ఇదీ చదవండి: మెంతినీటితో ఆరోగ్యప్రయోజనాలు మెండు.. ఇలా తాగితే డబుల్ బెనిఫిట్స్..


స్ట్రాబెర్రీ జ్యూస్ తయారీ విధానం..
ముందుగా స్ట్రాబెర్రీలను శుభ్రంగా కడగాలి. వాటి పై భాగం తొక్క తీసివేయాలి. ఆ తర్వాత వీటిని ఓ మిక్సిలోకి తీసుకోవాలి. అందులో తగినన్ని పాలు కూడా కలపాలి. మిక్సి ఆన్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. మీకు మరింత తీయ్యదనం కావాలంటే అందులో కాసింత షుగర్ వేసుకుంటే సరిపోతుంది. అయితే సాధ్యమైనంత వరకు చక్కెర వేయకుండానే తీసుకోవడం మేలు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter