Cranberry Benefits for Women: క్రాన్బెర్రీ జ్యూస్ స్త్రీలకు అమృతం.. అనేక వ్యాధులకు దూరంగా ఉంటూ ఈ 5 ప్రయోజనాలు పొందొచ్చు..

Cranberry Juice Benefits for Women: క్రాన్బెర్రీ ఎరుపురంగులో ఉంటుంది. ఇది మహిళలకు దివ్యౌషధం వంటిది. ఈ పండు ముఖ్యంగా యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతుంది. అంతేకాదు వృద్ధాప్యం, మోనోపాజ్ ను కూడా దీంతో ఆలస్యం అవుతుంది. మహిళలు ముఖ్యంగా క్రాన్బెర్రీ జ్యూస్ తమ డైట్లో చేర్చుకోవాలి.

Written by - Renuka Godugu | Last Updated : Feb 29, 2024, 05:46 PM IST
Cranberry Benefits for Women: క్రాన్బెర్రీ జ్యూస్ స్త్రీలకు అమృతం.. అనేక వ్యాధులకు దూరంగా ఉంటూ ఈ 5 ప్రయోజనాలు పొందొచ్చు..

Cranberry Juice Benefits for Women: క్రాన్బెర్రీ ఎరుపురంగులో ఉంటుంది. ఇది మహిళలకు దివ్యౌషధం వంటిది. ఈ పండు ముఖ్యంగా యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతుంది. అంతేకాదు వృద్ధాప్యం, మోనోపాజ్ ను కూడా దీంతో ఆలస్యం అవుతుంది. మహిళలు ముఖ్యంగా క్రాన్బెర్రీ జ్యూస్ తమ డైట్లో చేర్చుకోవాలి. దీనివల్ల మహిళలకు ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు? ఎన్నిరోగాలకు దూరంగా ఉండచ్చో తెలుసుకుందాం.

విటమిన్ల పవర్‌హౌస్.. 
క్రాన్‌బెర్రీస్ నిజంగానే విటమిన్లు, ఖనిజాలకు పవర్ హౌస్. ఎందుకంటే ఇందులో విటమిన్ సి అద్భుతమైన మూలం. క్రాన్బెర్రీస్ లో విటమిన్ సి ,ఇ, మాంగనీస్ ,రాగి పుష్కలంగా ఉంటాయి.

ఇదీ చదవండి: చెడు కొలెస్ట్రాల్‌ని సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తక్షణమే తగ్గించే సహజ మూలిక..!

ఇమ్యూనిటీ బూస్టర్..
క్రాన్బెర్రీజ్యూస్‌ ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. ఇది మహిళల గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. క్రాన్బెర్రీ జ్యూస్ తీసుకోవడం వల్ల రక్తంలో సిరల్లో సైతం పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను క్లీన్ చేస్తుంది.

కాల్షియం లోపం..
క్రాన్బెర్రీల్లో ఉండే మెగ్నీషియం ఎముకల బలహీనతను నిరోధిస్తుంది. సాధారణంగా ఎముకల బలహీనత కాల్షియం లోపం వల్ల వస్తుంది. అంతేకాదు మహిళలు మోనోపాజ్‌కు దగ్గర పడుతున్నప్పుడు కూడా ఇలా ఎముకలు బలహీనపడతాయి. ఈ జ్యూస్‌తో కండరాల్లో సైతం శక్తి వస్తుంది.

కండరాల తిమ్మిరి..
క్రాన్బెర్రీ జ్యూస్ డైట్లో చేర్చుకోవడం వల్ల డిప్రెషన్, వెన్నునొప్పి తగ్గుతుంది. క్రాన్బెర్రీలో ఉండే మెగ్నీషియం కండరాల తిమ్మిరిని నయం చేస్తుంది. ముఖ్యంగా మహిళలు కండరాల తిమ్మిరి సమస్య కనిపించగానే తమ డైట్లో క్రాన్బెర్రీని యాడ్ చేసుకోవాలి.

మహిళల్లో వచ్చే మోనోపాజ్ దీనివల్ల వచ్చే అనేక అనారోగ్య సమస్యలకు కూడా క్రాన్బెర్రీలు చెక్ పెడతాయి. ముఖ్యంగా మోనోపాజ్ లక్షణాలైన నిరాశ, రాత్రిపూట చెమటలు పట్టడం, యూరినరీ ట్రాక్ట్‌ ఇన్పెక్షన్ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు.

కొల్లెజన్..
క్రాన్బెర్రీలను మహిళలు డైట్లో చేర్చుకోవడం వల్ల అనారోగ్యసమస్యలు మాత్రమే కాదు సౌందర్యపరంగా కూడా అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యంగా క్రాన్బెర్రీలు కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడతాయి. దీంతో ప్రీ రాడికల్ సమస్య రాకుండా నిరోధించవచ్చు. దీంతో త్వరగా వృద్ధాప్య ఛాయలు రాకుండా ఉంటాయి.

ఇదీ చదవండి: మెంతినీటితో ఆరోగ్యప్రయోజనాలు మెండు.. ఇలా తాగితే డబుల్ బెనిఫిట్స్..

గుండె ఆరోగ్యం..
క్రాన్‌బెర్రీస్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. ఈ పండులో ఉండే యాంటీఆక్సిడెంట్ లక్షణాలు గుండెకు మేలు చేస్తాయి. అందుకే త్వరగా గుండెపోటుకు గురయ్యే ప్రమాదం ఉండదు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News