Instant Idli Recipe: మనలో చాలా మంది ముఖ్యంగా ప్రతి భారతీయ ఇల్లల్లో కామన్‌గా బ్రేక్‌ఫాస్ట్‌లో తయారు చేసుకొనే వంటకం ఇడ్లీ. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పిల్లలు, పెద్దలు ఇష్టంగా తినే ఆహారం. అయితే మనం ఇడ్లీలను ఎక్కువగా ఇడ్లీ పిండితో తయారు చేస్తుంటాము. దీని కోసం మనం ముందుగానే పిండిని రుబ్బుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. కానీ ఎప్పుడైన గోధుమ పిండితో ఇడ్లీ తయారు చేసుకున్నారా? దీని గురించి విన్నారా? అయితే ఈ గోధుమ పిండి ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గోధుమ పిండితో మనం ఎక్కువగా చపాతీ, పరోటా, పూరీ వంటి ఆహారపదార్థాలను తయారు చేస్తాము. కానీ దీంతో ఇడ్లీ కూడా తయారు చేసుకోవచ్చు. పిండి లేని సమయంలో ఎంతో సులభంగా ఈ విధంగా ఇడ్లీలను తయారు చేసుకోవచ్చు.  ఇవి రుచికరంగా, అద్భుతంగా ఉంటాయి. ఇడ్లీలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం...


కావలసినవి:


గోధుమ పిండి - 2 కప్పులు


బేకింగ్ సోడా - 1/4 


ఉరద్ పప్పు - 1 స్పూన్‌


అల్లం - చిన్న ముక్కలు


చిక్పీస్ - 1 స్పూన్‌


ఆవాలు - 1 స్పూన్‌


జీలకర్ర - 1/2 స్పూన్‌


పచ్చిమిర్చి - 2 


క్యారెట్ తురుము


పుల్లని పెరుగు - 1/2


కరివేపాకు, కొత్తిమీర


వాటర్‌


ఉప్పు


నూనె


తయారు విధానం: 


ముందుగా ఒక తవాలో రెండు కప్పుల గోధుమపిండిని రంగు, వాసన వచ్చే వరకు వేయించాలి.  ఆ తరువాత ఓవెన్లో తవాను ఉంచండి. అందులో కొంచెం నూనెను కలుపుకోవాలి. నూనె వేడియ్యాక  ఉల్లి పప్పు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించి, ఆవాలు, జీలకర్ర వేసి, సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఆ తరువాత క్యారెట్‌లను వేయించాలి అలాగే  కొత్తిమీర చల్లి పాన్ దించి చల్లారనివ్వాలి.


 ఒక గిన్నెలో వేయించిన గోధుమపిండి,  ఉప్పు, పెరుగు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఇడ్లీ పిండిలా తయారు చేసుకోవాలి. తర్వాత కొంచెం బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి. అందులోకి వేగించిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి స్టౌ మీద పెట్టి మరిగించాలి. ఇందులో కొద్దిగా నూనె రాసి  పిండిని పోసి మరిగించి తీసుకుంటే రుచికరమైన, పోషక విలువలున్న వీట్ ఇడ్లీ రెడీ.. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి